ముక్క లేనిదే ముద్ద దిగని జనాలు ఎందరో ఉన్నారు. దీంతో రోజు రోజుకు నాన్ వెజ్ తినే వారి సంఖ్య పెరుగుతుంది.

ఒకప్పుడు పండగలకు, చుట్టాలు వస్తే మాత్రమే చికెన్, మటన్ తినేవారు.

ప్రస్తుతం వెజ్ తక్కువ నాన్ వెజ్ ఎక్కువ. సండే అయినా మండే అయినా మటన్, చికెన్ ఉండాలి అంటున్నారు.

కొందరికి చికెన్ ఇష్టం అయితే కొందరికి మటన్ మహా ఇష్టం. మరి ఈ రెండింటిలో ఏది మంచిది అని ఎప్పుడైనా కనుక్కున్నారా?

చికెన్ కంటే మటన్ మంచిదని.. దీనివల్ల ప్రయోజనాలు ఎక్కువ అంటున్నారు నిపుణులు. చికెన్ వల్ల గుండె చుట్టూ కొవ్వు పేరుకుపోతుందట. దీంతో గుండెపోటు వచ్చే అవకాశం ఉందట.

చికెన్ కోసం కోళ్లు కావాలి. వీటిని పెంచడానికి  ఇంజక్షన్లు కావాలి అన్నట్టుగా ఉంది నేటి పరిస్థితి. వీటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉందట.

గుండె సమస్యలు, క్యాన్సర్ ముప్పు ఉన్న చికెన్ కంటే మటన్ బెటర్ అంటున్నారు నిపుణులు. మటన్ వారానికి రెండు సార్లు అయినా తినవచ్చట.

మటన్ వల్ల మంచి జరుగుతుందని కానీ ఏ విషయంలో అతి సర్వత్రా వర్జయేత్ అంటున్నారు. మరి జాగ్రత్త.