పోషకవిలువలు కలిగిన అరటి పండ్లు అంటే చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా చిన్నపిల్లలకు మరింత ఇష్టం.

ఎంత ఇష్టం ఉన్న కొన్ని సమస్యలు ఉన్నవారు మాత్రం వీటి జోలికి పోకూడదు. మరి ఎవరు అరటిపండ్లకు దూరంగా ఉండాలో చూసేద్దాం.

ఈ పండ్లలో చక్కెర ఎక్కువ ఉంటుంది. అందుకే మధుమేహం ఉన్నవారు దూరంగా ఉండాలి.

ఇందులో పొటాషియం ఎక్కువ ఉంటుంది. అందుకే మూత్రపిండాల సమస్యతో బాధపడే వారు  అరటి పండ్లకు దూరంగా ఉండాలి.

మలబద్దకం సమస్య ఉన్నవారు కూడా అరటి పండ్లకు దూరంగా ఉండాలి. మలబద్దకం సమస్య మరింత పెంచుతుంది.

అరటిపండు అంటే ప్రాణం అంటారు కొందరు. అయినా సరే అలర్జీ ఉంటే దూరంగా ఉండాలి.వీరు తింటే వాపు, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది.

మీకు అస్తమా ఉంటే కూడా అరటి పండుకు దూరంగా ఉండాలి. అరటి పండు తింటే.. అస్తమా మరింత పెరుగుతుంది.

కొందరికి మలబద్దకంతో పాటు ఉదర సంబంధ వ్యాధులు కూడా వస్తాయి. ఇందులోని కొన్ని సమ్మేళనాలు మైగ్రేన్ ను ప్రేరేపిస్తాయట.