వర్షాకాలంలో చాలా వ్యాధులు వచ్చే ఆస్కారం ఉంది. ఈ కాలంలో మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ప్రయత్నించాలి.

ఈ కాలంలో పెరిగిన తేమ బ్యాక్టీరియాను వృద్ధి చెందిస్తుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయి. అందుకే వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి కొన్ని ఆహారాలను తెలుసుకుందాం.

వెల్లుల్లి: వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది. ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లు, వైరస్‌లను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.

అల్లం : అల్లం గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీని వల్ల శరీరం వేడిగా ఉంటుంది. అందుకే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.

గింజలు : వాల్‌నట్‌లు, బాదం, వేరుశెనగతో సహా నట్స్‌లో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి అవసరమైన విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.

కాకరకాయ: ఈ గ్రీన్ వెజిటేబుల్ యాంటీ ఆక్సిడెంట్స్ పవర్‌హౌస్ అని చెప్పవచ్చు.  రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.

బొప్పాయి: బొప్పాయిలో శోథ నిరోధక ప్రభావాలు, ఎసెన్ ఉన్నాయి. కాబట్టి ఈ బొప్పాయిని కూడా తీసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు.