వర్షాకాలం ప్రారంభమైంది.  ఈ నేపథ్యంలో బురదలో వాహనాలు స్కిడ్ కావడం కామనే. కొన్ని చర్యలు తీసుకుంటే ప్రయోజనం కలుగుతుంది.

పాత టైర్లు ఉంటే మార్చుకోండి. వెనుక ఉండే టైర్లు మంచిగుండేలా చూసుకోవాలి. లేకపోతే బండి త్వరగా స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది.

టైర్లకు గ్రూపులు లేకపోతే మట్టి రోడ్డుపై తొందరగా పడుతుంది. ఇలా వానకాలంలో మనం బండి కింద పడకుండా జాగ్రత్తలు తీసుకోకుంటే ఇబ్బందులు తప్పవు. ఈ కారణంగానే బండి నడిపే విషయంలో మనం అప్రమత్తంగా ఉండాలి.

బండికి ఉండే ఇండికేటర్లు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. వర్షాకాలంలో వాటి పాత్ర ముఖ్యం.   వానకాలంలో తొందరగా చీకటి పడుతుంది. అందుకే మనకు వెలుతురు ఉండాలంటే ఇండికేటర్లు ఉండాల్సిందే. 

బైక్ బ్రేకులు సరిగా పనిచేయకపోయినా సమస్యలొస్తాయి. రోడ్లపై వేగంగా కాకుండా నెమ్మదిగా వెళ్లండి. లేదంటే ప్రమాదాలు పొంచి ఉంటాయి.

వానకాలంలో హెల్మెట్ ఉపయోగించండి. హెల్మెట్ ఉంటే ప్రమాదం జరిగినా మన తలకు గాయం కాకుండా ఉంటుంది.  

ఎలాంటి నష్టాలు కలగకుండా చూసుకునే క్రమంలో మనం అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది. కాలానుగుణంగా మన జాగ్రత్తలో మనం ఉండటమే సురక్షితం.