మీకు బలపాలు తినే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త

బలపాలు తినే అలవాటు చాలా మందికి ఉంటుంది.. పిల్లలు, పెద్దవారు, ముఖ్యంగా మహిళలకు కూడా ఈ అలవాటు ఉంటుంది.

బలపాలు తినే అలవాటు చిన్నతనం నుంచే ఉంటుంది. పెద్దగా అయిన తర్వాత కూడా ఈ అలవాటును మానేయరు.

చిన్నప్పుడు బలపాలు తింటే పెద్దగా అయిన తర్వాత కూడా సమస్యలు వచ్చే ఆస్కారం ఉందట. అందుకే వీలైనంత త్వరగా మానేయాలి.

ఐరన్ లోపం ఉన్న పిల్లలకు బలపాలను తినాలి అనిపిస్తుందట. దీన్ని సున్నంతో చేస్తారు కాబట్టి అసలు మంచిది కాదు అంటున్నారు నిపుణులు.

బలపాలు తింటే ఆడవారికి మూత్రపిండాల్లో రాళ్లు వస్తాయట. ఇది మగవారితో పోలిస్తే ఆడవారిలోనే ఎక్కువ ఉంటుందట.

జీర్ణ సమస్యలు, రక్తహీనత వస్తాయి. మూత్రపిండాలు ప్రభావితం అవుతాయి. డయేరియా, రుతుస్రావం ఆలస్యం అవుతుందట.

దంతాలు దెబ్బతింటాయట. దవడ మీద కూడ ప్రభావం చూపుతాయట బలపాలు. అందుకే వీటిని తినడం మానేయండి.