పులులకు మన దేశం లోని ఈ ప్రాంతాలు పెట్టని కోటలు. ఇంతకీ అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే..

సాత్పురా నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్ సాత్పూరా నేషనల్ పార్క్ లో దాదాపు 50 వరకు పులులు ఉన్నాయి. ఈ అడవిలో అడవి పందులు, ఎలుగుబంట్లు, చిరుతలు , అడవి కుక్కలను చూడవచ్చు.

సుందర్ బన్ నేషనల్ పార్క్, పశ్చిమబెంగాల్ పశ్చిమ బెంగాల్లో సుందర్ బన్ అడవులు  ప్రపంచంలో అతిపెద్ద మడ అడవులు. ఇక్కడ పులులను చూడడం ఒకరకంగా సవాల్.

తడోబా ఫారెస్ట్, మహారాష్ట్ర మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్ లో గణనీయమైన పులులు ఉన్నాయి.  అత్యంత క్రూరమైనవి..దారుణంగా వేటాడగలవు.

పెంచ్ నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్ రుడ్ యార్డ్ క్లిప్పింగ్ రాసిన జంగిల్ బుక్ పుస్తకానికి ఈ అడవి ప్రేరణ. ప్రసిద్ధమైన పులులు ఈ అడవిలో ఆవాసం ఉంటాయి. కాలర్ వాలి అనే పులి ఈ అడవిలోనే పుట్టింది.

పిలిజిబిత్ టైగర్ రిజర్వ్, ఉత్తర ప్రదేశ్ ఉత్తరప్రదేశ్లోని ఈ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో  పులులతోపాటు చిరుత పులి, 250 రకాల పక్షి జాతులు, పలు రకాల సరిసృపాలు ఈ అడవిలో ఉన్నాయి.

కన్హా నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్ ఈ పార్కులో రెట్టింపు సంఖ్యలో పులులు ఉన్నాయి.. జింకలు, నక్కలు, పందులు, హైనాలు, జింకలు, వివిధ రకాలైన పక్షులకు ఈ అడవి ఆలవాలం.

బాంధవ్ నగర్ నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్ చారలు ఉన్న పులులు కనిపిస్తాయి.   దట్టమైన వృక్షాలతో నిండి ఉంటుంది.  నీటి ఏనుగులు ఈ అడవిలో ప్రత్యేకంగా కనిపిస్తాయి.

రణ తంబోర్ నేషనల్ పార్క్, రాజస్థాన్ దేశంలో అతిపెద్ద ఉద్యానవనాలలో రణతంబోర్ నేషనల్ పార్క్ ఒకటి.  81 పులులు ఉన్నాయి.  మచ్లీ పులిని ప్రపంచంలో ఉన్న ఫోటోగ్రాఫర్లు ఎక్కువగా ఫోటోలు తీశారు.

కార్బెట్ టైగర్ రిజర్వు, ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో విస్తారంగా పులులు ఉంటాయి. 1936లో ఈ అడవిని జాతీయం చేశారు. 260 కి పైగా పులులు ఉన్నాయట.

Off-white Banner

Thanks For Reading...