హార్మోన్ల అసమతుల్యత, సరైన జుట్టు సంరక్షణ లేకపోవడం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వంటి వాటివల్ల జుట్టు రాలుతుంది.

వీటి వల్ల జుట్టు త్వరగా రాలుతుంది బట్టతల కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

జుట్టు సమస్యల నుంచి తప్పించుకోవడానికి కొన్ని టిప్స్ ఇప్పుడు చూసేద్దాం.

ఒత్తిడి: ఒత్తిడి ఎక్కువగా ఉంటే జుట్టు రాలుతుందట.అందుకే మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఒత్తిడిని నివారించండి.

ఆరోగ్యకరమైన ఆహారం: విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే సమతుల్య, పోషకమైన ఆహారాన్ని తీసుకోవాలి. దీనివల్ల హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవచ్చు.

 వ్యాయామం హార్మోన్ల స్రావాన్ని నియంత్రిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. తలకు రక్త సరఫరాను ప్రోత్సహిస్తుంది, జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.

స్కాల్ప్/హెడ్ మసాజ్: తలలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉండటానికి హెయిర్ వాష్‌కు ముందు కనీసం వారానికి రెండుసార్లు సహజ నూనెతో మీ తలకు మసాజ్ చేసుకోండి.

ధూమపానం: ధూమపానం వల్ల జుట్టు త్వరగా రాలుతుంది. జుట్టుకు మాత్రమే కాదు ఆరోగ్యంగా ఉండాలంటే ధూమపానం మానేయాలి.