మన సుందరమైన దేశంలో ఎన్నో రకాల అందాలు ఉన్నాయి. కొత్త ప్రదేశాలకు వెళ్లడం కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు. మరీ ముఖ్యంగా చాలామందికి రోడ్ ట్రిప్స్ అంటే చాలా ఇష్టం.
Images source: google xt
ఇండియాలో చాలానే రోడ్ ట్రిప్స్ ఉన్నాయి. మరి బెస్ట్ రోడ్ ట్రిప్స్ ఏవో ఈరోజు స్టోరీలో మనం తెలుసుకుందాం.
Images source: google
-మనాలి టూ లేహ్ : చాలామంది డ్రీమ్ ప్లేస్ లేహ్. ఇది జమ్మూ కాశ్మీర్‌లోని లడఖ్‌లో ఉంది. మనాలి నుంచి లేహ్‌కి 427 కిలో మీటర్ల దూరం ఉంటుంది. మనాలీ నుంచి లేహ్ వెళ్లే రోడ్డు మంచు కొండల మధ్యలో బైక్ మీద వెళ్తుంటే ఆ ఫీల్ వేరే. లైఫ్‌లో ఒక్కసారి అయిన ఇలాంటి జర్నీ చేయాలని ఎక్కువ మంది భావిస్తారు.
Images source: google
-మున్నార్ టూ అల్లెప్పీ : చాలామందికి కేరళ డ్రీమ్ ప్లేస్. అందులో మున్నార్, అల్లెప్పీ అంటే ఇంకా చెప్పక్కర్లేదు. అయితే మున్నార్ నుంచి అల్లెప్పీకి రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే.. పచ్చని చెట్టులు, కాఫీ తోటలు, ఆ వాతావరణం, కొండలు, ప్రకృతి అందాలు మనస్సును కట్టిపడేస్తాయి. లైఫ్‌లో ఒక్కసారైన ఈ ట్రిప్ వెళ్లాల్సిందే.
Images source: google
-భుజ్ నుంచి ధోలావిరా : ధోలవిరా అనే ప్లేస్ రాన్ ఆఫ్ కచ్‌కి సమీపంలో ఉంటుంది. ఇది భుజ్ నగరం నుంచి దాదాపు 220 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడి నుంచి ధోలావిరాకు బైక్ లేదా ట్యాక్సీ మీద ప్రయాణిస్తుంటే.. మధ్యలో మీరు ఎన్నో రకాలు ఫుడ్స్ ఉంటాయి.
Images source: google
ఈ ప్రయాణంలో రెండు వైపులా అతి పెద్ద ఉప్పు ఎడారిని కనిపిస్తుంది. దీనిని చూడటానికి మీకు రెండు కళ్లు చాలవు. ఎందుకంటే ఇక్కడ ఆకాశం, భూమిను గుర్తించలేరు. ఇది చాలా పెద్దది కూడా. ధోలావిరా అనేది ఒక పురాతన నాగరిక ప్రదేశం. దీనిని చూడటానికి చాలా మంది వెళ్తుంటారు.
Images source: google
-గ్యాంగ్‌టక్ టూ గురుడోంగ్మార్ : సిక్కిం రాష్ట్రంలో ఉండే గురుడోంగ్మార్ ఒక అందమైన ప్రదేశం. ప్రకృతి అందాల నడుమ గ్యాంగ్ టక్ నుంచి గురుడోంగ్మార్ వరకు రోడ్డు ప్రయాణం చేస్తే మనస్సుకు చాలా ఆహ్లాదకంగా ఉంటుంది. తెల్లటి మంచు కొండల మధ్య ప్రయాణం.. గురుడోంగ్మార్ సరస్సు ఉంది. నవంబర్ నుంచి మే వరకు గడ్డ కడుతుంది.
Images source: google
-సిమ్లా టూ స్మితి : హిమాచల్ ప్రదేశ్‌లో ఎప్పుడూ తెల్లని మంచుతో కప్పబడి ఉంటుంది. సిమ్లా నుంచి స్మితికి రోడ్డు ప్రయాణం తప్పకుండా చేయాల్సిందే. చుట్టుూ కొండలు, కొండల్లో సన్యాసులు నివసించే మోనాస్టోరీలు ఉంటాయి. మఠాలు కొండపై అంచున ఉంటాయి. ఇవి చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి.
Images source: google