జాస్మిన్ ఆయిల్ తో ఇన్ని ప్రయోజనాలా? తెలిస్తే తెచ్చేసుకుంటారు..

జాస్మిన్ ఆయిల్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అందాన్ని పెంచడంలో కూడా ముందుంటుంది. ఇంతకీ వేటికి ఉపయోగిస్తారంటే..

హైడ్రేషన్ : జాస్మిన్ ఆయిల్ చర్మాన్ని లోపలనుంచి హైడ్రేట్ చేస్తుంది. తేమను లాక్ చేసి చర్మాన్ని ప్రకాశవంతంగా తాజాగా ఉంచుతుంది.

మొటిమలు : సహజ క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది కాబట్టి.. జాస్మిన్ ఆయిల్(మల్లె) చర్మం నుంచి మంటను తగ్గిస్తుంది. హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది.

వృద్ధాప్య ఛాయలు : జాస్మిన్ ఆయిల్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి ఆక్సీకరణ ఒత్తిడిని కలిగిస్తాయి. దీనివల్ల వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది.

స్కిన్ టోన్‌ : జాస్మిన్ ఆయిల్ స్కిన్ టోన్‌ను మెరుగుపరుస్తుంది. చర్మ దృఢత్వం, స్థితిస్థాపకతను నిర్వహించే కొల్లాజెన్, ఎలాస్టిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.

మచ్చలను తగ్గిస్తుంది : చర్మ కణాల పునరుత్పత్తి ప్రక్రియను ప్రోత్సహిస్తూ మచ్చలను తగ్గిస్తుంది. చర్మ ఆకృతిని మెరుగుపరుస్తుంది.

సున్నితమైన చర్మం : జాస్మిన్ ఆయిల్ సున్నితమైన చర్మం ఉన్నవారికి హెల్ప్ చేస్తుంది.. చర్మానికి పోషణ అందిస్తుంది. చికాకును తగ్గిస్తుంది.