https://oktelugu.com/

ప్రస్తుతం రోగనిరోధక శక్తి ప్రజలకు చాలా అవసరం. మీకు కొన్ని అలవాట్లు ఉంటే బలమైన రోగనిరోధక శక్తి మీ సొంతం అవుతుంది. ఇంతకీ ఏం చేయాలో ఓ సారి తెలుసుకోండి.

Image Credit : google

సమతుల్య ఆహారం : బలమైన రోగనిరోధక శక్తి కోసం అవసరమైన పోషకాలను అందించడానికి వివిధ రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తినండి.

Image Credit : google

తగినంత నిద్ర : రోగనిరోధక వ్యవస్థను పునరుద్ధరించడానికి, బలోపేతం చేయడానికి రాత్రి కచ్చితంగా 7-9 గంటల నాణ్యమైన నిద్ర అవసరం.

Image Credit : google

హైడ్రేషన్ : హైడ్రేటెడ్ గా ఉండటానికి పుష్కలంగా నీరు తీసుకోవాలి. రోగనిరోధక శక్తికి మాత్రమే కాదు మొత్తం శారీరక విధులకు సహాయం చేస్తుంది నీరు.

Image Credit : google

ఒత్తిడి : రోగనిరోధక ప్రతిస్పందనను మెరుగుపరచడానికి మైండ్‌ఫుల్‌ నెస్ గా, ధ్యానం, యోగా వంటి ఒత్తిడిని తగ్గించే పద్ధతులను ప్రాక్టీస్ చేయండి.

Image Credit : google

ధూమపానం/మద్యపానం మానుకోండి : ధూమపానం మానుకోండి, ఆల్కహాల్ కూడా మానేయాలి. ఎందుకంటే ఈ రెండూ రోగనిరోధక శక్తిని బలహీన పరుస్తాయి.

Image Credit : google

పరిశుభ్రత పద్ధతులు : అంటు వ్యాధులను నివారించడానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం చాలా అవసరం. మీ పరిసరాలను నీట్ గా ఉంచుకోండి. 

Image Credit : google

వ్యాయామం : రోగనిరోధక పనితీరును పెంచడానికి, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్రతి రోజు వ్యాయామం చేస్తుండాలి.

Image Credit : google