డ్రై ఫ్రూట్స్ అనగానే ముందుగా బాదం, పిస్తా గుర్తు వస్తాయి. ఇందులో బాదం గురించి చాలా సార్లు తెలుసుకున్నాం.

Image Credit : google

మరి పిస్తా తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసా? అయితే ఓ సారి లుక్ వేయండి.

Image Credit : google

పిస్తా పప్పుల్లో పోషకాలతో పాటు ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. విటమిన్ బి9 కూడా ఉంటుంది. అందుకే వీటిని రోజుకు 10-12 తీసుకోవాలి.

Image Credit : google

మోనోసాచురేటెడ్, పాలీఅన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచుతాయి. దీంతో గుండె జబ్బులు మాయం.

Image Credit : google

కేలరీలు తక్కువ ఉండే పిస్తా తినడం వల్ల బరువు కంట్రోల్ లో ఉంటుంది. ఇందులోని ప్రొటీన్, ఫైబర్ కడుపు నిండిన ఫీల్ ను తెస్తాయి.

Image Credit : google

పిస్తాలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా, ఫైబర్ ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువ ఉంటాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. డయాబెటిస్ వారికి పిస్తా మంచి స్నాక్స్.

Image Credit : google

లూటేన్, జియాంక్సితిన్, యాంటీ ఆక్సిడెంట్లు పిస్తాలో మెండుగా ఉంటాయి. ఇవి కంటిని నీలికాంతి నుంచి వయసు సంబంధిత సమస్యల నుంచి కాపాడుతాయి.

Image Credit : google

ఇందులోని విటమిన్ బి6 యాంటీ ఆక్సిడెంట్లు మెదడు ఆరోగ్యానికి తోడ్పడతాయి. జ్ఞాపక శక్తి పెరిగి న్యూరో డిజెనరేటివ్ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. 

Image Credit : google