నవ్వంటే మనుషులు మాత్రమే కాదు.. అందమైన అమ్మాయిలే అంతకన్నా కాదు.. జంతువులు కూడా నవ్వుతుంటాయి. ఈ సృష్టిలో అందంగా నవ్వే జాబితా ఒకసారి పరిశీలిస్తే..

క్వోక్కా ఇది చూడ్డానికి ఎలుకలా ఉంటుంది.  ఇది ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది. కంగారు జాతికి చెందింది.  ఇది ముసి ముసిగా నవ్వుతుంది.

డాల్ఫిన్స్ ఇవి సముద్ర జంతువులు.  డాల్ఫిన్ ఒడ్డుకు వచ్చినప్పుడు నవ్వుతూ ఉంటుంది. అప్పుడు దాని ముఖ కవళికలు మారుతాయి.

ధ్రువపు ఎలుగుబంట్లు ఇవి చూడ్డానికి చాలా పెద్ద పరిమాణంలో ఉంటాయి.  ఆహార అన్వేషణలో భాగంగా అవి ఒక్కోసారి నవ్వుతాయి. ఆ సమయంలో అవి చూడ్డానికి టెడ్డి బేర్ లాగా కనిపిస్తాయి.

కోలా ఆస్ట్రేలియా సముద్ర తీర ప్రాంతాల్లో జీవిస్తుంది.  ఇది పూర్తిగా శాకాహారి. చెట్లకు ఉన్న పండ్లను తింటుంది. దీనికి కడుపు నిండినప్పుడు నవ్వుతుంది.

రెడ్ పాండా చూడ్డానికి నక్కలాగా ఉంటుంది. చైనా ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అవి నవ్వినప్పుడు మిక్కీ మౌస్ లాగా దర్శనమిస్తుంటాయి.

సముద్రపు జంగుపిల్లి ఈ జంతువు పిల్లి జాతికి చెందింది. సముద్రాల్లో నివసిస్తుంది.   ఇది సముద్రపు ఒడ్డుకు వచ్చినప్పుడు నవ్వుతుంది. ముఖ్యంగా తన వేటకు ఏదైనా జంతువు బలైనప్పుడు ఒకలాంటి నవ్వు నవ్వుతుంది.

స్లాత్ ఈ జంతువు బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్. జీవితంలో ఎక్కువకాలం చెట్ల కొమ్మలకు తలకిందులుగా వేలాడుతూ ఉంటాయి. సమూహంగా ఉన్నప్పుడు నవ్వుతుంటాయి.

గోల్డెన్ రిట్రీవర్ ఈ శునకం చిన్నపాటి సింహం లాగా కనిపిస్తుంది.  నోట్లో నుంచి వచ్చిన నాలుక.. బయటికి వచ్చిన దంతాలతో ఒక్కోసారి అది నవ్వుతుంది.

ముళ్ల ఉడుత ముళ్ళ పంది జాతికి చెందిన ఈ జంతువు.. బొరియల నుంచి బయటికి వచ్చి ఒక్కోసారి నవ్వుతుంది. ఆ సమయంలో కిచ్ కిచ్ మంటూ శబ్దాలు చేస్తుంది.

ఏనుగు ఏనుగుల్లో పెద్దవాటి కంటే చిన్న ఏనుగులు నవ్వుతాయి. తన తల్లి దూరంగా వెళ్లి వచ్చిన తర్వాత వాటిని చూసి పిల్ల ఏనుగులు నవ్వుతాయి.

Off-white Banner

Thanks For Reading...