న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర కు బెంగళూరు.. హోమ్ గ్రౌండ్.. ఎందుకంటే..

Images source: google

న్యూజిలాండ్ జట్టుతో జరిగే మూడు టెస్టుల సిరీస్ కు భారత జట్టు సిద్ధమైంది. అక్టోబర్ 16న తొలి టెస్ట్ మొదలవుతుంది.

Images source: google

బెంగళూరు లోని చిన్న స్వామి మైదానం వేదికగా తొలి టెస్ట్ జరుగుతుంది. ఈ మైదానం న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్రకు హోమ్ గ్రౌండ్.

Images source: google

రచిన్ రవీంద్ర కుటుంబ సభ్యులు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరానికి చెందినవారు. వీరు ప్రస్తుతం న్యూజిలాండ్ దేశంలో స్థిరపడ్డారు.

Images source: google

"బెంగళూరు నాకు హోమ్ గ్రౌండ్ లాంటిది. నేను ఇక్కడ ఆడే మ్యాచ్ నా తల్లిదండ్రులతో పాటు తాతయ్య, నానమ్మ కూడా చూస్తారు. ఇది నాకు ఒక ఉద్వేగమైన క్షణమని" రచిన్ రవీంద్ర పేర్కొన్నాడు.

Images source: google

"నేను వెల్డింగ్టన్లో పుట్టాను.. అయినప్పటికీ నా మూలాలు భారత్ లో ఉండడం నాకు గర్వ కారణం. ఇక్కడి వాతావరణం నాకు నా మూలాలను గుర్తు చేస్తుందని" రవీంద్ర వివరించాడు.

Images source: google

"నేను వన్డే వరల్డ్ కప్, ఐపీఎల్ లో బెంగళూరు వేదికపై మ్యాచ్ లు ఆడాను. నా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడానికి ఈ మైదానం చక్కటి వేదికగా ఉపయోగపడిందని" రవీంద్ర జాతీయ మీడియాతో అన్నాడు.

Images source: google

రచిన్ రవీంద్ర బెంగళూరులో ఆడటం ఇదే తొలిసారి కాదు. వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై అతడు సెంచరీ(108) చేశాడు.

Images source: google