ఫుట్ బాల్ పేరు చెబితే చాలామందికి సాకర్ గుర్తుకొస్తుంది. సాకర్ తో సమానమైన చరిత్ర కోపా అమెరికా టోర్నీది. ఈ ఏడాది ఫ్లోరిడా వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో కొలంబియా పై అర్జెంటీనా 1-0 తేడాతో గెలిచింది. 

Image Credit : gettyimages

అర్జెంటీనా కెప్టెన్ మెస్సి కుడి కాలికి చీలమండ గాయం కావడంతో మైదానం నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించాడు. గతంలో కోపా అమెరికా కప్ లోనూ అతడు ఇదే విధంగా గాయపడ్డాడు. అప్పుడు కూడా అతడు మైదానం నుంచి బయటికి వెళ్లిపోయాడు. 

Image Credit : gettyimages

గాయం వల్ల డగ్ ఔట్ కు పరిమితమైన మెస్సీ వెక్కివెక్కి ఏడ్చాడు. ఆ సమయంలో తన కుడి కాలికి ఉన్న షూ ను తీసేసి బలంగా నేలకు కొట్టాడు. నిర్ణీత సమయం వరకు అర్జెంటీనా ఒక్క గోల్ కూడా చేయలేకపోవడంతో నిరాశలో కూరుకుపోయాడు.

Image Credit : gettyimages

ఫైనల్ మ్యాచ్ లో నిర్ణీత సమయం వరకు అటు కొలంబియా, ఇటు అర్జెంటీనా గోల్స్ సాధించలేదు. ఆట అదనపు సమయం వరకు వెళ్ళింది. దీంతో 112వ నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు మార్టినెజ్ గోల్ చేసి అర్జెంటీ నాకు తిరుగులేని విజయాన్ని అందించాడు.

Image Credit : gettyimages

కోపా అమెరికా కప్ లో అర్జెంటీనా ఫైనల్ వెళ్లడం ఇది 30వసారి. అయితే ఆ జట్టు ఏకంగా 16 సార్లు ట్రోఫీలు అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆధునిక ఫుట్ బాల్ చరిత్రలో మరే జట్టు కూడా ఈ స్థాయిలో ఘనతను సాధించలేదు.

Image Credit : gettyimages

అర్జెంటీనా జట్టు 2021లో కోపా అమెరికా కప్ సాధించింది. 2022లో సాకర్ ప్రపంచ కప్ అందుకుంది. 2024లో మరోసారి కోపా అమెరికా కప్ ను దక్కించుకుంది. నవీన ఫుట్ బాల్ చరిత్రలో అర్జెంటీనా సరికొత్త రికార్డులను సృష్టించింది. 

Image Credit : gettyimages

మార్టినెజ్ అద్భుతమైన గోల్ చేసి అర్జెంటీనాను గెలిపించాడు. ఈ నేపథ్యంలో అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కింది..

Image Credit : gettyimages

తన కెరియర్లో చివరి కోపా అమెరికా కప్ ఆడిన మెస్సి.. విజయంతో వీడ్కోలు పలికినట్టయింది. అర్జెంటీనా గెలవగానే మెస్సీ బిగ్గరగా అరిచాడు.. తమ జట్టు గెలవడంతో రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.

Image Credit : gettyimages