Images source : google
ఫుల్ గా ఓట్స్ తింటున్నారా? ఇంతకీ అవి వేటి నుంచి తయారు అవుతాయో మీకు తెలుసా? ఇవి ‘ఎవేనా సేటివా’ అనే మొక్క విత్తనాల నుంచి తయారు అవుతాయి. ఈ మొక్కలు చూడటానికి గోధుమ, బార్లీ మాదిరి ఉంటాయి.
Images source : google
ఇందులో ఐరన్, జింక్, మాంగనీస్, మెగ్నీషియం, కాపర్, ఫొలేట్, భాస్వరం, క్యాల్షియం, పొటాషియం, బి1, బి3, బి5, బి6 విటమిన్లు, థయామిన్ వంటి పోషకాలు ఉంటాయి. అందుకే ఇది మంచి పోషకాహారం.
Images source : google
వీటిని తింటే రక్త సరఫరా సాఫీగా అవుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. జీర్ణప్రక్రియ బాగుంటుంది. మలబద్దకం సమస్యకు చెక్ పెట్టవచ్చు. టైప్2 డయాబెటిస్ కు అవకాశం ఉండదు.
Images source : google
చర్మం మీద మంట, దురద రాదు. ముఖానికి కాంతి వచ్చేస్తుంది. పిల్లలకు బాల్యంలో వచ్చే శ్వాసకోశ సంబంధమైన సమస్యలు రావు.
Images source : google
కడుపు నొప్పి, విరేచనాలు, అపానవాయువు వంటి సమస్యలతో బాధపడుతుంటే వీటిని మీరు స్కిప్ చేయడమే బెటర్. లేదా సమస్య మరింత పెరుగుతుంది.
Images source : google
అలెర్జీ ఉందా? మీరు కూడా స్కిప్ చేసేయండి. దురద ఉన్నా సరే వీటి జోలికి వెళ్లకూడదు. ఇక ఓట్స్ లో భాస్వరం అధికంగా ఉంటుంది కాబట్టి మూత్రపిండాలపై ప్రభావం పడుతుంది.
Images source : google
ఇక కిడ్నీ సమస్యలు ఉంటే కూడా ఓట్స్ కు దూరంగా ఉండాలి. డయాబెటిస్‌తో బాధపడుతుంటే వైద్యుల సలహా తర్వాతనే వీటిని తీసుకోండి.
Images source : google