https://oktelugu.com/

కూరలు, టిపిన్ లు, చికెన్, మటన్ ఇలా ఏ వంటలో అయినా కొన్ని సార్లు తెలియకుండానే ఉప్పు ఎక్కువ అవుతుంది. తినలేక పడేయలేక ఇబ్బంది పడుతుంటారు చాలా మంది.

Images source: google

వంటల్లో ఉప్పు తక్కువైనా, ఎక్కువైనా కష్టమే కదా. రుచికి సరిపడా తీసుకుంటే ఆరోగ్యం మీసొంతం అవుతుంది.

Images source: google

మరి ఈ ఉప్పు ఎక్కువ అయితే పారేయడమేనా? లేదంటే ఏం చేయాలి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Images source: google

ఇప్పుడు మనం తెలుసుకోబోయే హోమ్ టిప్ప్ మొత్తం కూరలో ఉప్పును తగ్గిస్తాయి.

Images source: google

ఉల్లిపాయను తీసుకుని పొట్టు తీసి రెండు ముక్కలుగా కోయండి. వండిన కూరలో వేసి మరికాసేపు ఉడికిస్తే సరిపోతుంది. ఉల్లిపాయలు అదనపు ఉప్పును గ్రహించి ఉప్పును తగ్గిస్తాయి. లేదంటే వేయించిన ఉల్లిపాయలను అయినా సరే వాడండి.

Images source: google

ఒక కప్పు పుల్లటి పెరుగును బాగా చిలక్కొట్టి.. ఉప్పు ఎక్కువైన వంటలో పెరుగు కలపండి. పెరుగులోని పులుపు కూరలోని అదనపు ఉప్పును తగ్గిస్తుంది.

Images source: google

ఉప్పు ఎక్కువగా ఉంటే ఆ వంటలో కొంచెం చక్కెర, వెనిగర్ వేసి కలపండి. నిమ్మరసం కలిపినా ఫలితం ఉంటుంది.

Images source: google

కూరల్లో ఎక్కువైన ఉప్పును తొలగించడానికి బంగాళదుంప తొక్కలు ఉపయోగపడుతాయి. వంట సమయంలో బంగాళాదుంపల తొక్కలను కూరలో వేసి, కాసేపటి తర్వాత వాటిని తీసేయండి. ఇలా చేయడం వల్ల కూరలోని ఉప్పుదనం పోతుంది.

Images source: google