ఒకసారి మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఆలుగడ్డలను వారాల పాటు నిల్వ ఉంచుతారు చాలా మంది.

వారాల పాటు నిల్వ ఉంచిన ఆలుగడ్డలకు మొలకలు వస్తుంటాయి. కొందరు వీటిని కూర వండి తింటుంటారు.

మొలకలు వచ్చిన ఆలులో సోలనైన్, చాకోనైన్ అనే పాయిజన్ లెవల్ పెరుగుతాయట.

ఈ ఆలును తినడం వల్ల వాంతులు, ఫుడ్ పాయిజన్, పొట్ట సమస్యలు, నర్వ్ సిస్టమ్ దెబ్బతినడం వంటివి జరుగుతాయట.

గర్భం దాల్చిన మహిళలు ఇలాంటి ఆలుగడ్డలను తింటే కడుపులో పెరుగుతున్న బిడ్డలకు కూడా ప్రమాదమే.

కొన్ని సందర్బాలలో మొలకలు వచ్చిన ఆలు వల్ల ప్రాణాలు సైతం పోతాయి అంటున్నారు నిపుణులు.

ఆలు చిప్స్ తినే అలవాటు ఉంటే కూడా మానుకోండి. వీటి వల్ల సోడియం ఇంటేక్ పెరిగి బీపీ, గుండె సమస్యలు వస్తుంటాయట.

Off-white Banner

Thanks For Reading...