బొద్దింకల వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. భద్రత, పరిశుభ్రతను కాపాడుకోవడానికి వాటిని వంటగదిలోకి రానివ్వకూడదు.
Image Credit : google
మరి బొద్దింకలకు దూరంగా ఉండాలంటే ఏం చేయాలో ఓ సారి తెలుసుకోండి.
Image Credit : google
శుభ్రం : వంటగదిని క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. స్లాబ్లు, ఫ్లోర్ లు అన్నీ కూడా తుడవండి. బొద్దింకలు మురికికి త్వరగా వస్తుంటాయి.
Image Credit : google
సీల్ క్రాక్స్ : గోడలు, క్యాబిన్ లు, ఫ్లోర్ లలో పగుళ్లు, రంధ్రాలు ఏర్పడితే అక్కడ బొద్దింకలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ ఖాళీలను పూడ్చివేయండి.
Image Credit : google
ఆహారం నిల్వ : ఆహారంలో గాలి పోకుండా డబ్బాలకు మూతలు పెట్టండి. రాత్రిపూట బయట ఉంచవద్దు. సరిగ్గా ఆహారం నిల్వ ఉంటే బొద్దింకలు రావు.
Image Credit : google
నీటి నిల్వ : బొద్దింకలు జీవించడానికి నీరు అవసరం. మీ వంటగదిని పురుగులు లేకుండా చేయాలంటే నీరు ఉండకూడదు.
Image Credit : google
సహజ వికర్షకాలను : బొద్దింకలు ప్రవేశించే అవకాశం ఉన్న ప్రదేశాలలో వెల్లుల్లిని ఉంచండి. వేపాకులు కూడా బొద్దింకలను రానివ్వవట.
Image Credit : google
చెత్తను పారవేయండి : మీ వంటగదిలో చెత్తను ఎక్కువసేపు ఉంచవద్దు. మూత గట్టిగా ఉండే చెత్తబుట్టను ఉపయోగించాలి. చెత్తలో కూడా త్వరగా బొద్దింకలు వృద్ధి చెందుతాయి. ఎప్పటికప్పుడు చెత్తను పారవేయండి.
Image Credit : google