https://oktelugu.com/

రోజూ ఓ యాపిల్ తింటే డాక్టర్‌తో పనిలేదనే సామెత గురించి తెలిసిందే. యాపిల్స్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, వీటివల్ల మేలు జరుగుతుందని రోజూ వీటిని తింటారు.

Images source: google

ఆపిల్ పండ్లలో విటమిన్ సి, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలా అని అధికంగా తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి.

Images source: google

 ఎక్కువగా యాపిల్స్ తింటే జీర్ణక్రియ దెబ్బతింటుంది. అలాగే గ్యాస్ట్రిక్, కడుపునొప్పి, తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Images source: google

రోజుకి 20 నుంచి 40 గ్రాములు ఫైబర్ మాత్రమే అవసరం. అంతకంటే ఎక్కువగా ఫైబర్ తీసుకుంటే కడుపు సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

Images source: google

యాపిల్స్‌లో పొటాషియం, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అలాగే జీవక్రియ అనారోగ్యం, మధుమేహం వంటి సమస్యలు కూడా వస్తాయి.

Images source: google

యాపిల్స్‌పై కొన్ని రసాయనాలు చల్లుతుంటారు. వీటిలో డిఫెనిలామైన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇలా రసాయనాలు ఉండే యాపిల్స్‌ను తినడం వల్ల అలెర్జీ వస్తుంది.

Images source: google

యాపిల్స్ వల్ల బరువు ఎక్కువగా పెరుగుతారు. వీటిలో కార్బోహైట్రేట్లు, ఫైబర్ ఉండటం వల్ల శరీరంలో కొవ్వు పరిమాణం పెరుగుతుంది. దీంతో తొందరగా బరువు పెరుగుతారు.

Images source: google

ఎక్కువగా భోజనం చేసిన తర్వాత యాపిల్స్‌ను అస్సలు తినకూడదు. కాబట్టి యాపిల్స్‌ను తక్కువగా మాత్రమే తీసుకోండి. రోజుకి దాదాపు రెండు యాపిల్స్ తింటేనే మంచిది. అంతకంటే ఎక్కువగా తింటే అనారోగ్య పాలవుతారు.

Images source: google

యాపిల్స్‌ను సాయంత్రం లేదా రాత్రి అస్సలు తినకూడదు. ఈ సమయంలో తింటే ఎసిడిటీ, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి రాత్రిపూట యాపిల్ తినడం మానుకోండి. ఉదయం పూట యాపిల్ తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Images source: google