https://oktelugu.com/
శ్రీముఖి ప్రస్తుతంగా యాంకర్ గా.. నటిగా సత్తా చాటుతున్నారు.
ప్రజెంట్ బుల్లితెర మీద సందడి మొత్తం శ్రీముఖిదే.
ఒకటికి నాలుగు షోలు ఆమె ఖాతాలో ఉన్నాయి.
చెప్పాలంటే యాంకర్ సుమ, రష్మీ గౌతమ్ లను కూడా ఆమె వెనక్కి నెట్టారు.
ఆమె క్రేజ్ పెరిగిన నేపథ్యంలో సినిమా ఆఫర్స్ విరివిగా వస్తున్నాయట.
అయితే హీరోయిన్ గా సెటిల్ కావాలని కోరుకుంటున్న శ్రీముఖి ఆచితూచి ఆఫర్స్ ఒప్పుకుంటున్నారట.
కొంచెం పేరున్న నటులు, దర్శకులతో పని చేయాలని ఆశపడుతున్నారట.
చిన్న చిత్రాల్లో నటించడం వలన కెరీర్ కి ఉపయోగం ఉండదనేది ఆమె ఆలోచనగా తెలుస్తుంది.
అలాగే స్టార్ హీరోల చిత్రాల్లో శ్రీముఖి కీలక రోల్స్ చేస్తున్నారు. చిరంజీవి అప్ కమింగ్ మూవీ భోళా శంకర్ లో శ్రీముఖి క్యారెక్టర్ చాలా స్పెషల్ గా ఉంటుందట.
సంప్రదాయ ఫొటో షూట్ లతో అలరిస్తోంది.