స్టార్ యాంకర్ అనసూయ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు.

కాలిఫోర్నియా రాష్ట్రంలో విహరిస్తున్నారు. ఫ్యామిలీతో పాటు అక్కడకు వెకేషన్ కి వెళ్లిన అనసూయ కొన్ని ప్రొఫెషనల్ ఈవెంట్స్ లో కూడా పాల్గొంటున్నారు.

అనసూయ ఓ మ్యూజిక్ షోలో సందడి చేసినట్టు సమాచారం. ప్రాంతాన్ని, వేడుకను బట్టి బట్టలు ధరించే అనసూయ సూపర్ హాట్ గా తయారయ్యారు.

అనసూయ తన లేటెస్ట్ లుక్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

నెక్స్ట్ అనసూయ ఖాతాలో ఉన్న భారీ చిత్రం పుష్ప 2. సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2లో అనసూయ నెగిటివ్ రోల్ చేస్తున్నారు.

కాగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పెదకాపు టైటిల్ మూవీ ప్రకటించారు. విలేజ్ పొలిటికల్ డ్రామాగా పెదకాపు తెరకెక్కుతుంది.

ఈ మూవీలో అనసూయ కీలక రోల్ చేస్తుంది. టీజర్లో ఆమె లుక్ ఆకట్టుకుంది.