https://oktelugu.com/
అనసూయ తనదైన రీతిలో యాంకరింగ్ లో అదరగొట్టి జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించుకుంది.
ఇక దాని తర్వాత ఆమె వరుసగా కొన్ని షోలకు యాంకర్ గా వ్యవహరించింది.
రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి మెప్పించింది.
ఇక అప్పటినుంచి ఆమెకి వరుసగా సినిమాల్లో అవకాశాలు రావడంతో సినిమాల్లో నటిస్తూ తన కెరీర్ ని చాలా బిజీ గా గడుపుతుంది.
ఇక అందులో భాగంగానే ఆమె చేసిన టీవీ షో లన్నింటికీ బ్రేక్ ఇచ్చి సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసుకుంటూ వస్తుంది.
ఇక ఇప్పటికి కూడా అనసూయ కి ఉన్న క్రేజ్ అనేది ఏ మాత్రం తగ్గలేదు.
పుష్ప సినిమాలో కాత్యాయని క్యారెక్టర్ ని పోషించి పాన్ ఇండియా వైడ్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఇక ఈ సినిమా ఇచ్చిన గుర్తింపుతో అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటుంది.
తాజాగా తన కుమారులతో చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు వివిధ ప్రదేశాల్లో తిరిగిన ప్రదేశాల ఫొటోలను పంచుకుంది..
ఇది చూసి అనసూయ ఎంజాయ్ మామూలుగా లేదని అందరూ కామెంట్ చేస్తున్నారు.