జులైలో వెళ్లడానికి అనువుగా ఉండే అద్భుతమైన ప్రదేశాలు..

 అద్భుతమైన పర్వతాలు లేదా ప్రశాంతమైన బీచ్‌లకు వెళ్లాలి అనుకుంటున్నారా. ఇప్పుడు మేము కొన్ని అందమైన ప్రాంతాల గురించి చెబుతాము. చూసేయండి.

పాండిచ్చేరి అద్భుతమైన బీచ్‌లు, కలోనియల్ విల్లాలు, బోటిక్‌లను సందర్శించాలి అంటే పాండిచ్చేరి వెళ్లండి. మీకు ప్రశాంతమైన అనుభవం కావాలంటే ఇక్కడికి వెళ్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది.

ఉదయపూర్ పిచోలా సరస్సు ఒడ్డున ఉన్న ఉదయపూర్ గొప్ప సంస్కృతికి నిలయం. ఇక్కడ మంచి మార్కెట్‌లు, పురాతన కోటలు, వంటకాలను ఎంజాయ్ చేయవచ్చు.

లోనావాలా మహారాష్ట్రలోని ఈ హిల్ స్టేషన్ అద్భుతమైన జలపాతాలు, పచ్చని పర్వతాలకు నిలయం. ఇక్కడ సూర్యాస్తమయం చాలా అద్భుతంగా అందంగా ఉంటుంది.

గుల్మార్గ్ ప్రయాణీకుల స్వర్గం ఈ ప్రాంతం. గుల్మార్గ్  లో పచ్చని పచ్చికభూములు, ఉత్సాహభరితమైన పూల లోయలు, నదులు మంచుతో కప్పబడిన పర్వతాలతో ప్రకృతి దృశ్యాలుంటాయి.

గ్యాంగ్‌టక్ ఇక్కడ ఉన్న వివిధ బౌద్ధ ఆరామాలను అన్వేషించవచ్చు. హిమాలయ శ్రేణులు, హిమనదీయ సరస్సుల మధ్య ఆహ్లాదకరమైన బసను ఆస్వాదించవచ్చు.

ఈ ప్రాంతాలు జులైలో మరింత అందంగా ఉంటాయి కాబట్టి వెళ్లి ఎంజాయ్ చేయండి.