ప్రకృతిలో లభించే పండ్లలో అంజీర్ పండు కూడా ఒకటి. దీనిలో పోషకాలు మెండుగా ఉన్నాయి. దీన్ని తింటే ఎన్నో రకాల లాభాలున్నాయి.
Image Credit : pexels
అంజీర్ పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ మంచిగా పనిచేయడానికి పరోక్షంగా సాయపడుతుంది.
Image Credit : pexels
జీర్ణ సంబంధ సమస్యలు దూరం చేయడంలో కూడా ఇది తోడ్పడుతుంది. అంజీర్ పండ్లలో సోడియం, పొటాషియం ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. బీపీని కంట్రోల్ లో ఉంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
Image Credit : pexels
ఆడవారికి రక్తహీనత దూరం చేయడంలో కూడా అంజీర్ పండ్లు ఉపయోగపడతాయి. భోజనానికి ముందు వీటిని తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి.
Image Credit : pexels
మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి విషజ్వరాలకు విరుగుడుగా పనిచేస్తుంది. ప్లేట్ లెట్లు తగ్గిన వారికి వీటిని తినిపిస్తే వెంటనే ప్లేట్ లెట్లు పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు.
Image Credit : pexels
అధిక బరువుకు చెక్ పెట్టే బలం ఉన్న ఆహారం అంజీర్ పండ్లే. ఇందులో పెక్టిన్ అనే పదార్థం ఉండటం వల్ల అది శరీరంలోని వ్యర్థాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
Image Credit : pexels
మన రోగ నిరోధక శక్తిని పెంచడంలో అంజీర్ పండ్లు సాయపడతాయి. ఇందులో మెగ్నిషియం, మాంగనీసు, జింక్ సమృద్ధిగా ఉండటం వల్ల సంతానం కావాలనుకునే వారి కోరికలు తీర్చేదిగా పనిచేస్తుంది.
Image Credit : pexels
మధుమేహం ఉన్న వారికి మంచి మందులా మారుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరగకుండా చేస్తుంది.
Image Credit : pexels