ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే రక్తం నుంచి కణంలోకి గ్లూకోజ్ తీసుకోవడం సరైన రీతిలో జరగనప్పుడు, దీని ఫలితంగా ప్యాంక్రియాస్‌లోని బీటా కణాల ద్వారా ఇన్సులిన్ స్రావం పెరుగుతుంది.

Image Credit : google

హైపర్‌ ఇన్సులినిమియా అంటే రక్తంలో ఇన్సులిన్ అధికంగా ఉండటం. ఈ అధిక ఇన్సులిన్,  కొవ్వు  ఇన్సులిన్- నిరోధకతను చేస్తాయి. అయితే మీకు కూడా ఇన్సులిన్ నిరోధకత ఉంటే, మీ ఆహారంలో ఈ కొన్ని ఆహారాలను చేర్చుకోవాలి. అవేంటంటే..

Image Credit : google

సోయాబీన్ : సోయాబీన్స్‌లోని బయోయాక్టివ్ సమ్మేళనాలు రక్తంలో GLUT4 స్థాయిలను పెంచడం ద్వారా ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. సోయాబీన్స్‌లోని ఐసోఫ్లేవోన్‌లు ఫాస్టింగ్ ఇన్సులిన్ స్థాయిలు, HOMA IR గణనీయంగా తగ్గుతాయని తేలింది.

Image Credit : google

దాల్చిన చెక్క : దాల్చినచెక్కను భోజనంలో లేదా భోజనం తర్వాత అయినా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ, సామర్థ్యం పెరుగుతుంది. దాల్చిన చెక్క ఆక్సీకరణ ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.అంతేకాదు గ్లూకోజ్ నియంత్రణలో తోడ్పడుతుంది.

Image Credit : google

అల్లం : డయాబెటిస్ ఉన్నవారి రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. మీ కాలేయం, మెదడు, కళ్ళు, మూత్రపిండాలను రక్షిస్తుంది అల్లం. మీ ఆహారంలో అల్లం చేర్చడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి.

Image Credit : google

రోజ్మేరీ : ఇన్సులిన్ లాంటి ప్రభావాలను కలిగి ఉంటుంది రోజ్మరీ. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నివారిస్తుంది. రోజ్మేరీ ఆకులను నీటిలో ఉడకబెట్టి టీ తయారు చేసుకొని తాగడం లేదా వేయించిన కూరగాయలకు రోజ్మేరీని కలిపి కూడా తీసుకోవచ్చు..

Image Credit : google

మెంతులు : మెంతులు పేగుల నుంచి చక్కెరలను శోషించడాన్ని ఆలస్యం చేస్తాయి. ఇవి పోస్ట్‌ప్రాండియల్ ఇన్సులిన్ స్పైక్‌ను తగ్గించగలవు. మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయం తినాలట. మెరుగైన ఫలితాల కోసం, భోజనానికి 10 నిమిషాల ముందు వాటిని తినండి.

Image Credit : google

అలోవెరా : రక్తంలో చక్కెర స్థాయిలను, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది. మెటా-విశ్లేషణలో, కలబంద వల్ల మధుమేహం, ప్రీ-డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెరలను,  HbA1cని తగ్గిస్తుందని తేలింది. దీన్ని జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.

Image Credit : google