క్రెడిట్ కార్డుల వినియోగం పెరిపోతుంది. ఒకప్పుడు పెద్ద వ్యాపారాలు చేసే వారి వద్దే క్రెడిట్ కార్డులు కనిపించేవి. కానీ ఇప్పుడు చిరుద్యోగి వద్ద కూడా ఇవి ఉంటున్నాయి.

క్రెడిట్ కార్డుల ద్వారా పర్చేజ్ చేయడం వల్ల రివార్డ్ పాయింట్లు వస్తుంటాయి.  అయితే జూలై 15 నుంచి క్రెడిట్ కార్డుల నిబంధనల్లో మార్పులు వచ్చాయి. 

కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డుల రూల్స్ ను సవరించాయి. ఇవి వినియోగదారులపై ఎఫెక్ట్ పడనున్నాయి. అవేంటంటే? 

రివార్డుల విషయంలో, లావాదేవీలపై కొన్ని బ్యాంకులు లేటేస్టుగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. 

జూలై 15 నుంచి   SBI క్రెడిట్ కార్డు ద్వారా ప్రభుత్వ లావాదేవీలు జరిపితే ఎలాంటి రివార్డు పాయింట్స్ రావు. 

సిటీ బ్యాంకు కు చెందిన క్రెడిట్ కార్డు జూలై 15 నాటికి అన్ని మైగ్రేషన్ ప్రక్రియలను పూర్తి చేసుకోవాలని వినియోగదారులను కోరింది. 

 ICICI క్రెడిట్ కార్డు  కొత్త రూల్స్ జూలై 1 నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ క్రెడిట్ కార్డు ఉన్నవారు రీప్లేస్ మెంట్ కు ఇప్పటి వరకు రూ.100 మాత్రమే చెల్లించేవారు. ఇకపై రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది.

ఈ క్రెడిట్ కార్డు ద్వారా చెక్కు, నగదు పికప్ వంటి సేవలు నిలిచిపోనున్నాయి. చార్జ్ స్లిప్ రిక్వెస్ట్ పై రూ.100 చార్జిలు కూడా ఆగిపోనున్నాయి.