బాల్.. బాల్ కి ఉత్కంఠ మధ్య అప్ఘాన్- బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది.. నరాలు తెగే ఒత్తిడిలో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించి సెమీస్ కు దూసుకెళ్లింది.

టాస్ గెలిచిన ఆఫ్ఘానిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.  20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది

114 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా జట్టుకు ఓపెనర్లు మెరుగైన ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు.

మైదానంపై తేమ విపరీతంగా ఉండడంతో ఆఫ్గానిస్థాన్ బౌలర్లు 'సద్వినయోగం చేసుకున్నారు. ముఖ్యంగా నవీన్ ఉల్ హక్ బంగ్లా బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు..

ఓపెనర్ లిటన్ దాస్ (49 బంతుల్లో 54; ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) తో మాత్రమే నిలబడ్డాడు. చివరి వరకు మైదానంలో ఉండి ఒంటిరి పోరాటం చేశాడు

కానీ చివర్లో నవీన్ ఉల్ హక్ మాయాజాలం చేయడంతో దాస్ అర్థ శతకం వృధా అయ్యింది.

తస్కిన్ అహ్మద్,  రెహమాన్ వికెట్లను వరుస బంతుల్లో పడగొట్టడంతో.. ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించింది.

ఈ విజయం ద్వారా ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ చేరుకుంది. గ్రూప్-1 లో భారత్ తర్వాతి స్థానంలో నిలిచింది. ఈ జట్టు సౌత్ఆఫ్రికా తో సెమీ ఫైనల్ లో తలపడుతుంది.