ఆఫ్ఘనిస్తాన్ జట్టు టి20 వరల్డ్ కప్ లో అద్భుతాలు సృష్టిస్తోంది. సూపర్ -8 లో బలమైన ఆస్ట్రేలియా జట్టును ఓడించి, సంచలనం సృష్టించింది..

అంతకు ముందు వన్డే వరల్డ్ కప్ లోనూ సంచలనాలు నమోదు చేసింది.

ఇంగ్లాండ్ ను మట్టి కరిపించింది 2023 లో భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు సంచలనం నమోదు చేసింది. 69 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టును ఓడించింది.

పాకిస్తాన్ జట్టుకు షాక్ ఇచ్చింది ఇదే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టుకూ ఆఫ్ఘనిస్తాన్ షాక్ ఇచ్చింది. ఏకంగా 8 వికెట్ల తేడాతో తిరుగులేని విజయాన్ని సాధించింది.

న్యూజిలాండ్ కు కోలుకోలేని దెబ్బ టి20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ జట్టును ఆఫ్ఘనిస్తాన్ ఓడించింది. 75 పరుగులకే ఆలౌట్ చేసి, 84 పరుగులతో తేడాతో గెలుపొందింది. 

కంగారులను బెంబేలెత్తించింది టి20 వరల్డ్ కప్ సూపర్ -8 లో ఆస్ట్రేలియా జట్టును ఆఫ్ఘనిస్తాన్ 21 పరుగుల తేడాతో మట్టికరిపించింది. 

భారత్ ముందు పప్పులు ఉడకలేదు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాను ఓడించిన ఆఫ్గనిస్తాన్.. భారత్ ముందు నిల్వలేకపోయింది. సూపర్ -8 లో 47 పరుగులతో గెలిచింది.