https://oktelugu.com/
ఓవర్ నైట్ స్టార్ అయిన వాళ్లలో కృతి శెట్టి ఒకరు.
తెలుగులో వచ్చిన ‘ఉప్పెన’ సినిమాతో ఈ బేబమ్మ ఇప్పుడు సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ సినిమా అవకాశాలు దక్కించుకుంటుంది.
తెలుగులో వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టకుండా సినిమాలు చేస్తూ మిగతా వారి కంటే ముందుంటోంది.
కృతి శెట్టి సినిమాల్లోకి రాకముందు ముంబైలో ఉండేది.
అక్కడ చదువు కొనసాగిస్తున్న సమయంలోనే కొన్ని కమర్షియల్ యాడ్స్ లో నటించింది.
ఆ తరువాత ‘ఉప్పెన’తో స్టార్ నటిగా మారింది.
ప్రస్తుతం వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ తెలుగులో బిజీ అయ్యింది.