వెలకట్టలేని త్యాగాలెన్నో చేసే నాన్న నుంచి ఎంత నేర్చుకున్న తక్కువే. అయితే తండ్రి నుంచి నేర్చుకోవాల్సిన 8 ముఖ్యమైన పాఠాలు

-ఇష్టానికి వదిలేయండి.. పిల్లలు తమకిష్టమైన పనులు చేసినప్పుడు ఏ తండ్రి అడ్డు చెప్పకపోవడమే మంచిది.  తప్పుడు పనుల విషయంలో మాత్రం జాగ్రత్తలు తెలపాలి.

-స్వేచ్ఛకు అవకాశం ఇవ్వాలి..  పిల్లల మనసు ఒక స్థాయి వరకు మాత్రమే కష్టపెట్టి.. ఆ తరువాత వారి ఇష్టానికి వదిలేయడమే బెటర్ అని చాలా మంది తండ్రులు ఆలోచిస్తారు 

-సమస్య పరిష్కారానికి ఎన్నో దారులు..  ప్రతీ సమస్యకు ఏదో ఒక పరిష్కారం తప్పనిసరిగా ఉంటుంది. దాని కోసం వెతికే ప్రయత్నం చేయాలి.

-భయం వీడాలి.. మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు భయాన్ని వీడాలి. భయం మనిషిని ఏ పని చేయనివ్వదు.  ఇలాంటి విషయాలు ఒక తండ్రి మాత్రమే తన కొడుకుకు చెప్పగలడు.

-అనుగుణంగా ఉండే దుస్తులను వేసుకోండి.. మనసు ప్రశాంతంగా ఉండడానికి కన్వినెంట్ దుస్తులను ధరించాలి.  చిన్నవయసులో స్కూలుకెళ్లే సమయంలోనే తండ్రి చెప్పే మాటలివి.

-ప్రయత్నించి.. నియంత్రించవద్దు.. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటిని దాటే క్రమంలో నిరాశ చెందవద్దు. ప్రయత్నిస్తూనే ఉండాలి 

-కొత్త పరిచయాలు పెంచుకోవాలి.. ఒంటరితనం నరకం లాంటిది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలివిడిగా ఉండడం వల్ల శరీరం, మనసు ఉల్లాసంగా మారుతుంది.  కొత్త పరిచయాలతో తెలివి పెరుగుతుంది.