భారత్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా అరుదైన జీవజాతులు అంతరించిపోయాయి.  గడిచిన 150 ఏళ్లలో అంతరించిపోయిన ఆ జంతువుల గురించి స్పెషల్ ఫోకస్..

తెల్ల ఖడ్గమృగం అతిపెద్ద క్షీరదాలలో ఒకటి.  భూమి మీద అతిపెద్ద రెండో జంతువు.  తెల్ల ఖడ్గమృగం ఆఫ్రికా ఖండంతో  పాటు కాంగో, దక్షిణ సూడాన్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వంటి దేశాల్లో నివసిస్తోంది. దీని సంతతి వేగంగా తగ్గిపోతోంది.

ఆసియా చిరుత అంతరించిపోతోంది. అడవులు వేగంగా కనుమరుగైపోతున్న నేపథ్యంలో చిరుతలు కనిపించకుండా పోతున్నాయి.

డచ్ ఆల్కాన్ బ్లూ బటర్ ఫ్లై కూడా లేకుండా పోతున్నాయి. మీనపు కలర్ లో మెరిసే సీతాకోక చిలుకలు భవిష్యత్ లో ఇక కనిపించవు.

పింటా ఐలాండ్ తాబేలు కూడా కనిపించకుండా పోతోంది. వాతావారణ కాలుష్య ప్రభావంతో వాటి సంతతి క్రమంగా కనుమరుగవుతోంది.

టెకోపా పప్ ఫిష్ ఇక్కడి చేపలు కూడా లేకుండా పోతున్నాయి. వాటి మనుగడ ప్రశ్నార్థకంలో పడుతోంది.

స్కోమ్ బర్గ్ జింకలు కూడా అంతరిస్తున్నాయి. అడవులు క్రమంగా క్షీణించడం వల్ల వాటి జనాభా పెరగడం లేదు. ఫలితంగా వాటి సంతతి కనుమరుగవుతోంది.

యాంగ్జీనది డాల్ఫిన్. చైనాలో ఉండే ఈ నది ప్రపంచంలోనే మూడోది. ఇక్కడ ఉండే డాల్ఫిన్ లు క్రమంగా వాతావరణ కాలుష్యం వల్ల అంతరించాయి.

జాంజిబార్ చిరుతపులుల జనాభా కూడా కనిపించడం లేదు. అడవులు లేకుండా చేయడంతో వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది.

జవాన్ టైగర్ ఇండియాలో కనిపించే పులులు క్రమంగా అంతరిస్తున్నాయి. అడవుల విస్తీర్ణం తగ్గిపోవడంతో వాటి మనుగడ సాగడం లేదు.

Off-white Banner

Thanks For Reading...