Amigos: త్వరలో థియేటర్స్ లో విడుదల అవ్వబోతున్న సినిమాలలో ప్రేక్షకుల్లో మంచి అంచనాలను సెట్ చేసిన చిత్రం కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’.ఎల్లపుడూ విభిన్నమైన కథలను ఎంచుకొని ఆడియన్స్ ని థ్రిల్ కి గురయ్యేలా చేసే అలవాటు ఉన్న కళ్యాణ్ రామ్ చేస్తున్న మరో ప్రయోగం ఇది..టీజర్ మరియు ట్రైలర్ తో ప్రేక్షకుల్లో అంచనాలను అమాంతం పెంచేసిన ఈ సినిమా ఈ నెల 10 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతుంది.

Amigos
ఇందులో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ చేసాడు.చాలా కొత్త రకమైన సబ్జెక్టు తో డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి పూర్తిగా కమర్షియల్ ఫార్మాట్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.కచ్చితంగా అభిమానులకు ఈ చిత్రం ఒక పండగే అని మూవీ టీం చాలా నమ్మకం తో ఉంది.గత ఏడాది విడుదలైన కళ్యాణ్ రామ్ భింబిసారా చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే..ఈ సినిమా అంతకు మించి సక్సెస్ సాదిస్తుందని అంచనా వేస్తున్నారు.
అయితే ఈ సినిమాని తొలుత విజయ్ దేవరకొండ తో చేద్దాం అనుకున్నాడట డైరెక్టర్ రాజేందర్ రెడ్డి..కథ కూడా బాగా నచ్చింది,కానీ అప్పటికే ఆయన లైగర్ మూవీ కి రెండేళ్ల పాటు డేట్స్ మొత్తం కేటాయించడం తో ఈ సినిమాని సబ్జెక్టు ని వదులుకోవాల్సి వచ్చింది.చూస్తుంటే చాలా ఆసక్తికరమైన సబ్జెక్టు లాగ ఉంది, విజయ్ దేవరకొండ చేసి ఉంటె పాన్ ఇండియా లెవెల్ లో మోతమోగిపోయేది, బంగారం లాంటి అవకాశం ని మిస్ చేసుకున్నాడు అంటూ విశ్లేషకులు విడుదలకు ముందే అనుకుంటున్నారు.

Amigos
ఒకవేళ విడుదల తర్వాత అనుకున్న అంచనాలను ఈ సినిమా అందుకుంటే కచ్చితంగా విజయ్ దేవరకొండ బాధ పడాల్సి వస్తుంది..చూడాలి మరి ఈ సినిమా ఆ రేంజ్ లో ఉంటుందా లేదా అనేది.ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మొన్ననే హైదరాబాద్ లో భారీ గా చేసారు..ఈ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నాడు..ఆయన స్పీచ్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.