Waltair Veerayya : సంక్రాంతి వచ్చేస్తోంది..ఇది రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు పెద్ద పండగ..సినిమా ఇండస్ట్రీకి కూడా అలాంటి పండగ.. అందుకే సంక్రాంతి సీజన్ కోసం నిర్మాతలు అలా కొట్టుకుంటారు.. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా సంక్రాంతి బరిలో రెండు పెద్ద హీరోల సినిమాలు, ఒక డబ్బింగ్ సినిమా మన ముందుకి రాబోతున్నాయి..అవి నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘వీర సింహా రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ మరియు తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘వారసుడు’ సినిమాలు.
వీటిల్లో చిరంజీవి మరియు బాలకృష్ణ సినిమాలు రెండూ కూడా మైత్రి మూవీ మేకర్స్ నుండి వస్తున్న సినిమాలే.. తెలుగు సినిమా హిస్టరీలో ఇప్పటి వరకు ఒకే ప్రొడక్షన్ హౌస్ నుండి వస్తున్న రెండు పెద్ద సినిమాలు ఒక్క రోజు తేడాతో విడుదల అవ్వలేదు..కానీ మైత్రి మూవీ మేకర్స్ ఆ సాహసానికి ఒడిగట్టింది.. అయితే గత రెండు రోజుల నుండి ఫిలింనగర్ లో వినిపిస్తున్న ఒక వార్త మెగా అభిమానులను నిరాశకి గురి చేస్తోంది.
అసలు విషయానికి వస్తే.. మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం సంక్రాంతి రేస్ నుండి తప్పుకున్నట్టు ఫిలిం నగర్ లో ఒక వార్త జోరుగా వినిపిస్తుంది..షూటింగ్ మరింత బ్యాలన్స్ ఉండడంతో మూవీ టీం ఆ నిర్ణయానికి వచ్చిందంటూ ఒక పుకారు తెగ చక్కర్లు కొడుతోంది.. విడుదలకి సరిగ్గా నెల సమయం ఉంది..కానీ ప్రొమోషన్స్ విషయం లో మూవీ టీం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
బాస్ పార్టీ సాంగ్ తర్వాత ఈ మూవీకి సంబంధించి ఒక్క అప్డేట్ కూడా రాలేదు..మరోపక్క ‘వీర సింహా రెడ్డి’ కి విడుదల తేదీ కూడా ప్రకటించేసారు..ఇదంతా చూస్తుంటే ‘వాల్తేరు వీరయ్య’ అసలు సంక్రాంతికి వస్తుందా అనే సందేహాలు ప్రేక్షకుల్లో మరియు అభిమానుల్లో మొదలయ్యాయి..ఈ సందేహాలకు డైరెక్టుగా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే సమాధానము చెప్పాలి.
డిసెంబర్ 10 వ తేదీన ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన రవితేజ కి సంబంధించిన టీజర్ ని విడుదల చేస్తాము అన్నారు..5 వ తేదీ ఒక పోస్టర్ ద్వారా అధికారిక ప్రకటన చేస్తాము అని కూడా అన్నారు..కానీ ఏమి జరగలేదు..దీనితో ఈ సినిమా వాయిదా పడింది అనే అనుమానాలు మరింత ఎక్కువ అయ్యాయి.