Waltair Veerayya Collections: మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికీ రికార్డ్స్ నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోతూనే ఉంది..ఫ్యామిలీ ఆడియన్స్ ఒక సినిమాకి కనెక్ట్ అయితే లాంగ్ రన్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పడానికి ఉదాహరణ ‘వాల్తేరు వీరయ్య’..చిరంజీవి కమర్షియల్ సినిమా చాలా కాలం తర్వాత చెయ్యడం, దానికి తోడు మాస్ మహారాజ రవితేజ కూడా ఈ సినిమాలో ఉండడం వల్ల విడుదలకి ముందు నుండే భారీ అంచనాలు ఉండేవి.

Waltair Veerayya Collections
ఆ అంచనాలను మొదటి రోజు మొదటి ఆట నుండే అందుకుంది ఈ చిత్రం ..ఇక ఆ తర్వాత వారం రోజుల్లోనే వంద కోట్ల రూపాయిల షేర్ ని అందుకోవడం..పది రోజుల్లోపే 200 కోట్ల రూపాయిల గ్రాస్ కి రీచ్ అవ్వడం, అలా అన్నీ జరిగిపోయాయి..68 ఏళ్ళ వయస్సున్న ఒక హీరో ఈ రేంజ్ రికార్డ్స్ పెట్టడం అంటే మామూలు విషయం కాదు..ఒక చరిత్ర.
ఇప్పటికి మెజారిటీ సిటీస్ లో హౌస్ ఫుల్స్ తో నడుస్తున్న ఈ చిత్రం అతి త్వరలోనే 250 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకోబోతుంది..షేర్ 138 కోట్ల రూపాయలకు చేరుకోబోతుంది..అది ఈ వారం లోనే జరుగుతుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి..ఒక ప్రాంతీయ కమర్షియల్ చిత్రానికి ఈ రేంజ్ వసూళ్లు రావడం అనేది మామూలు విషయం కాదు..ఆచార్య మరియు గాడ్ ఫాథర్ వంటి వరుస కమర్షియల్ ఫెయిల్యూర్స్ తర్వాత ఈ రేంజ్ కం బ్యాక్ మూవీ మెగాస్టార్ ఇంత తొందరగా ఇస్తాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు.

Waltair Veerayya Collections
మెగాస్టార్ పని అయిపోయింది అని అనుకున్న ప్రతీసారీ ఈ రేంజ్ కం బ్యాక్ ఇవ్వడం ఆయనకీ చాలా కామన్..ఇది వరకు చాలా సార్లు అలా తన సత్తా ఏంటో చూపించాడు..68 ఏళ్ళ వయస్సు లో కూడా ఇప్పటికీ అదే రేంజ్ జోరు చూపిస్తున్నాడు..ఇక భవిష్యత్తులో రాబొయ్యే సినిమాలతో ఆయన ఇలాంటి వండర్స్ ఎన్ని సృష్టిస్తాడో చూడాలి.