Waltair Veerayya Collections: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాళ్తేరు వీరయ్య’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సంచలన విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే.. కేవలం వారం రోజుల్లోనే 100 కోట్ల షేర్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డుని నెలకొల్పిన ఈ చిత్రం అతి త్వరలోనే ఆల్ టైం టాప్ 5 చిత్రాలలో ఒకటిగా నిలవబోతుంది.

Waltair Veerayya Collections
ప్రస్తుతం 120 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం ఫుల్ రన్ లో 135 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకునే అవకాశం ఉందని చెప్తున్నారు ట్రేడ్ పండితులు.. అయితే ఇన్ని రోజులు స్టీడీ కలెక్షన్స్ ని రాబట్టిన ఈ సినిమా నిన్న కాస్త డల్ అయ్యింది..12 రోజుల పాటు నాన్ స్టాప్ కోటి రూపాయిల షేర్ కి పైగా వసూలు చేసిన ఈ చిత్రం నిన్న ఒక్క రోజు మాత్రం కోటి కంటే తక్కువ షేర్ ని రాబట్టే అవకాశం ఉందని తెలుస్తుంది.

Waltair Veerayya Collections
అందుకు కారణం కూడా లేకపోలేదు.. నిన్న బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన ‘పఠాన్’ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యింది.. యాక్షన్ జానర్ సినిమా కావడం తో ఈ మూవీ పై టాలీవుడ్ లో కూడా ఒక రేంజ్ అంచనలు ఏర్పడ్డాయి.. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన ఓపెనింగ్ ని దక్కించుకుంది.. ఆ సినిమా ప్రభావం పడడం వల్లే మన వీరయ్య జోరు కాస్త తగ్గిందని అంటున్నారు.. అయితే ఆ ప్రభావం కేవలం మొదటి రోజు వరకే ఉంటుంది.. రెండవ రోజు నుండి షరామామూలే.. ఈరోజు నేషనల్ హాలిడే అవ్వడం తో ‘వాళ్తేరు వీరయ్య’ కి కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.. చూడాలిమరి.