Waltair Veerayya 12th Day Collection: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విస్ఫోటనం సృష్టించిందో అందరికీ తెలిసిందే..వరుస పరాజయాలతో డీలాపడిన మెగా ఫ్యాన్స్ కి ఈ సినిమా ఇచ్చిన కిక్ మామూలుది కాదు..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ సినిమా ఎలాగో, మెగాస్టార్ చిరంజీవి కి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం అలా అన్నమాట..ఈ రెండు సినిమాలను అభిమానులు జీవితం లో ఎప్పటికీ మర్చిపోలేరు..కేవలం వారం రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా వంద కోట్ల రూపాయిల షేర్ ని సాధించిన ఈ చిత్రం , అతి త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకోబోతుంది..నిన్న కూడా ఈ చిత్రానికి కోటి 20 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి..మొత్తం మీద 12 రోజులకు గాను ఈ సినిమా ఇప్పటి వరకు ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మనం చూద్దాము.

Waltair Veerayya 12th Day Collection
ప్రాంతం: వసూళ్లు(షేర్):
నైజాం 32.59 కోట్లు
సీడెడ్ 16.62 కోట్లు
ఉత్తరాంధ్ర 17.71 కోట్లు
ఈస్ట్ 12.05 కోట్లు
వెస్ట్ 7.08 కోట్లు
నెల్లూరు 4.13 కోట్లు
గుంటూరు 7.07 కోట్లు
కృష్ణ 7.15 కోట్లు
మొత్తం 104.40 కోట్లు
ఓవర్సీస్ 12.62 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 7.60 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 124.62 కోట్లు
‘వాల్తేరు వీరయ్య’ కలెక్షన్స్ 11 వ రోజుతో పోలిస్తే 12 వ రోజు కాస్త తగ్గింది..అయినా కానీ వర్కింగ్ డేస్ లో డీసెంట్ హోల్డ్ అనే చెప్పాలి..రేపు రిపబ్లిక్ డే..అంటే నేషనల్ హాలిడే..రేపు వచ్చే వసూళ్లు ఈ సినిమాకి అత్యంత కీలకం కానున్నాయి.

Waltair Veerayya 12th Day Collection
రేపటి తోనే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే వంద కోట్ల షేర్ మార్కుని అందుకుంటుంది..ఆ రేర్ ఫీట్ తో టాలీవుడ్ నుండి తెలుగు రాష్ట్రాల్లో రెండు వంద కోట్ల రూపాయిల షేర్స్ సినిమాలు ఉన్న ఏకైక హీరో గా మెగాస్టార్ చిరంజీవి సరికొత్త చరిత్ర సృష్టించిన వాడిగా నిలిచిపోతాడు..ప్రస్తుతానికి అయితే ఈ సినిమా ఫుల్ 130 కోట్ల రూపాయలకు మించి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..మరి ‘అలా వైకుంఠపురం లో’ మూవీ రికార్డ్స్ ని ఈ సినిమా బద్దలు కొడుతుందా లేదా అనేది చూడాలి.