Waltair Veerayya 200 Crore Club: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తూనే ఉంది.. విడుదలకి ముందు నుండే భారీ హైప్ తో విడుదలైన ఈ సినిమాకి మొదటి రోజే బంపర్ ఓపెనింగ్ దక్కింది.. సుమారుగా 30 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రానికి ఆ తర్వాతి రోజు నుండి కూడా అద్భుతమైన వసూళ్లు వచ్చాయి.

Waltair Veerayya 200 Crore Club
అలా కేవలం వారం రోజుల్లోనే వంద కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టిన ఈ చిత్రం, పది రోజుల్లో 200 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి ఫాస్టెస్ట్ 200 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన సినిమాలలో ఒకటిగా నిలిచింది..రాజమౌళి సినిమాలు కాకుండా ఇది వరకు ఫాస్టెస్ట్ 200 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కు ని అందుకున్న చిత్రం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘సై రా నరసింహా రెడ్డి’.
ఈ సినిమా కేవలం 8 రోజుల్లోనే 200 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది.. ఆ తర్వాత ఫాస్టెస్ట్ 200 కోట్ల రూపాయిల గ్రాస్ సాధించిన చిత్రాలుగా ‘అలవైకుంఠపురం లో’ మరియు ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలు నిలిచాయి.. ఈ రెండు సినిమాలు కూడా 200 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టడానికి పది రోజుల సమయం తీసుకుంది.. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రం నిలిచింది.

Waltair Veerayya 200 Crore Club
ఈ సినిమాకి 12 రోజుల సమయం పట్టినట్టు తెలుస్తోంది.. ఈ ఫాస్టెస్ట్ 200 కోట్ల గ్రాస్ సాధించిన సినిమాలలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలే రెండు ఉండటం విశేషం.. దీనిని బట్టి 68 ఏళ్ళ వయస్సులో మెగాస్టార్ స్టార్ స్టేటస్ ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు.. ఒక్క రజినీకాంత్ మినహా ఈ రేంజ్ స్టార్ స్టేటస్ ని ఈ వయస్సు లో ఎంజాయ్ చేస్తున్న హీరో ఎవ్వరు లేరు అని చెప్పొచ్చు.