Vishwak Sen – Arjun : యంగ్ హీరో విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ దాస్ కా ధమ్కీ. పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో విడుదల చేస్తున్నారు. విశ్వక్ సేన్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. నేడు విశ్వక్ సేన్ మీడియాతో ముచ్చటించగా ఆయనకు ఇబ్బందికర ప్రశ్న ఎదురైంది. నటుడు అర్జున్ దర్శకత్వంలో మీ మూవీ వివాదాలతో ఆగిపోయింది. ఆయనకు మీరు పెద్ద మొత్తంలో చెల్లించారని టాక్ . దీనికి మీ సమాధానం ఏమిటని అడగ్గా… విశ్వక్ స్పందించేందుకు ఇష్టపడలేదు. ఆ వివాదంతో దాస్ కా ధమ్కీ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి దానికి గురించి మాట్లాడను అంటూ సమాధానం దాటవేశారు.
గత ఏడాది విశ్వక్ సేన్ హీరోగా నటుడు అర్జున్ ఒక చిత్రం స్టార్ట్ చేశారు. అర్జున్ దర్శకుడిగా ఉన్న ఈ చిత్రంలో ఆయన కూతురు ఐశ్వర్య హీరోయిన్. షూటింగ్ మొదలయ్యాక అర్జున్-విశ్వక్ మధ్య విభేదాలు తలెత్తాయి. ప్రెస్ మీట్ పెట్టిన అర్జున్ నా కెరీర్లో ఇంత క్రమశిక్షణ లేని నటుడిని చూడలేదని కామెంట్ చేశారు. సుదీర్ఘ కెరీర్లో చాలా మందితో పని చేశాను. విశ్వక్ కి నిబద్ధత లేదు. షెడ్యూల్ డేట్ ఫిక్స్ చేశాక పలుమార్లు వాయిదా వేశాడు. ఫైనల్ గా నేను ఈ మూవీ చేయడం లేదని మెసేజ్ పెట్టాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అతనిపై కంప్లైంట్ చేయడం జరిగింది.
దీనికి సమాధానంగా విశ్వక్ సేన్ ప్రెస్ మీట్ పెట్టారు. సెట్స్ లో ఆయన మాటే చెల్లాలి అంటారు. ఏవైనా మార్పులు సూచిస్తే వినరు. అర్జున్ ప్రవర్తనతో నేను విసిగిపోయాను. అందుకే ప్రాజెక్ట్ వద్దనుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు. విశ్వక్ సేన్ కారణంగా డబ్బులు నష్టపోయానని ఫిర్యాదు చేసిన అర్జున్… అతన్నుంచి తిరిగి వసూలు చేశారనే ప్రచారం జరిగింది. ఈ ప్రశ్నకు విశ్వక్ సేన్ సమాధానం చెప్పలేదు. ఇక దాస్ కా ధమ్కీ ఉగాది కానుకగా మార్చి 22న విడుదల కానుంది.
దాస్ కా ధమ్కీ చిత్రంలో విశ్వక్ సేన్ నటించి, దర్శకత్వం వహించారు. పాగల్ ఫేమ్ నరేష్ కొప్పిలి ని దాస్ కా ధమ్కీ చిత్రానికి డైరెక్టర్ అనుకున్నారట. ఈ కథకు ఆయన న్యాయం చేయగలడని డిస్కషన్స్ కూడా జరిగాయట. ఆ ప్రాసెస్ లో తను అనుకున్నదానికి నరేష్ కొప్పిలి ఆలోచనలకు పోతన కుదరలేదట. ఈ క్రమంలో తానె దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడట. .