Ori Devuda Movie Review: తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు యువ కథా నాయకుల హవా నడుస్తోంది. వీరిలో కొంతమంది రొటీన్ కు భిన్నంగా ఉండే కథలను ఎంచుకోవడంతో ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్నారు. అటువంటి వారిలో ముందు వరుసలో ఉండే నటుడు విశ్వక్సేన్. ఫలక్ నామా దాస్ చిత్రంతో ఆరంగేట్రం చేసిన ఈ యువ కథానాయకుడు తొలి సినిమా తోనే ఆటిట్యూడ్ స్టార్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత హిట్ ది ఫస్ట్ కేస్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. తర్వాత పాగల్ సినిమా ప్రమోషన్ లో భాగంగా టీవీ9 ఛానల్ యాంకర్ దేవితో పడిన గొడవతో మరింత పాపులర్ అయ్యాడు. యూత్ లో మంచి క్రేజ్ సంపాదించిన ఈ నటుడు నటించిన ఓరి దేవుడా సినిమా ఈరోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా?

vishwak sen
-కథ ఏమిటంటే
అర్జున్, అను చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఒకరోజు అను పెళ్లి చేసుకోమని అర్జున్ ను అడుగుతుంది. దీంతో అర్జున్ గందరగోళానికి గురవుతాడు. ఇది ఇలా ఉండగానే ఇద్దరి తల్లిదండ్రులు పెళ్లి తేదీని నిర్ణయిస్తారు. వివాహ తంతు మోసిన తర్వాత అను తనకు మంచి స్నేహితురాలు మాత్రమే అని అర్జున్ తెలుసుకుంటాడు. ఆమెతో జీవితాంతం కలిసి ఉండలేనని, ఆమె తనను ఎంపిక చేసుకోవడం సరైన నిర్ణయం కాదని భావిస్తాడు. అదే సమయంలో అతడు స్కూల్లో తన సీనియర్ అయిన మీరాను కలుస్తాడు. అనేక నాటకీయ పరిణామాల మధ్య సినిమా సాగుతుంది. అర్జున్ తన రిలేషన్షిప్ సమస్యను పరిష్కరించుకోవడం, నిజమైన ప్రేమను కనుగొనడంతో సినిమా ముగుస్తుంది.
–ఎవరు ఎలా నటించారంటే?
ఈ సినిమాలో విశ్వక్సేన్, దగ్గుబాటి వెంకటేష్, మిథిలా పాల్కర్, ఆశాభట్, రాహుల్ రామకృష్ణ, మురళి శర్మ, నాగినీడు తదితరులు నటించారు. ఈ సినిమాకి రచన, దర్శకత్వం: అశ్వత్ మరిమత్తు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పెరల్ వీ పొట్లూరి, పరమ్ వీ పొట్లూరి నిర్మించారు. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించారు. విధు అయ్యన ఫొటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు.
-ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది అంటే?
ఓరి దేవుడా సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ ఓ మై కడవులే కి అధికారిక రీమేక్. తెలుగు వెర్షన్ లో కథాంశాన్ని మక్కికి మక్కిదించారు. సన్నివేశాల్లోనూ పెద్దగా మార్పులు లేవు. ఒక రకంగా ఈ సినిమా గత ఏడాది నితిన్, కీర్తి సురేష్ నటించిన రంగ్ దే మాదిరి కనిపిస్తూ ఉంటుంది. ఇందులో దగ్గుబాటి వెంకటేష్ అతిథి పాత్రలో నటించారు కాబట్టి.. ఆయనకు కూడా మంచి సన్నివేశాలు రాశారు. ముఖ్యంగా వెంకటేష్ విశ్వక్సేన్ కు టికెట్ ఇచ్చే సన్నివేశాలు మాత్రమే ఇందులో కొత్తగా చేర్చారు. తెరపై వీటిని చూస్తుంటే ఫ్రెష్ గా అనిపిస్తాయి. ప్రేక్షకులకు ఆసక్తి కలిగిస్తాయి. తర్వాత ఏం జరుగుతుందో అని ఆలోచించేలా చేస్తాయి. కథ రొటీన్ గా ఉన్నా స్క్రీన్ ప్లే బాగుంటే బండి నడిపించవచ్చు. కానీ ఈ సినిమాలో స్క్రీన్ ప్లే సో సో గా కనిపిస్తుంది. కోర్టు సీన్స్ తో మొదలై, విశ్వక్సేన్ వెంకటేష్ ను కలవడం, ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళటం.. తర్వాత పరిణామాలతో చివరి వరకు వెళ్లిపోవడంతో స్క్రీన్ ప్లే సాగదీసినట్టు కనిపిస్తుంది. చివరిలో ఇప్పటి యువతకు కనెక్ట్ అయ్యే మంచి సందేశం తో సినిమా ముగుస్తుంది.
-ఎవరు ఎలా చేశారు అంటే?
ఈ సినిమాలో అర్జున్ గా నటించిన విశ్వక్సేన్ స్క్రీన్ పై చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తాడు. కానీ కొన్ని సన్నివేశాల్లో అతని ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది. పైగా విశ్వక్సేన్ లావుగా అనిపించడంతో అతడి లుక్స్ అంతగా మెప్పించవు. ” లిటిల్ థింగ్స్” సిరీస్లో కనిపించిన మిథిలా పాల్కర్ ఈ సినిమాలో మంచి స్కోప్ ఉన్న పాత్ర చేసింది. ఆమె తెలుగు సినిమాలో నటించడం మొదటిసారి అయినప్పటికీ.. ఎక్కడ కూడా డెబ్యూ హీరోయిన్ అనిపించదు. ఇక దగ్గుబాటి వెంకటేష్ గురించి చెప్పాల్సిన పని ఏముంది. అతడికి అచ్చొచ్చిన అతిథి పాత్రలో చెలరేగిపోయాడు. రాహుల్ రామకృష్ణ వెంకటేష్ అసిస్టెంట్ గా డీసెంట్ నటనతో అలరించాడు. ఆశా భట్ నటన అంతంతమాత్రంగానే ఉంది. గ్లామర్ కోసమే ఈమెను తీసుకున్నట్టు తెలుస్తోంది. మురళీ శర్మ, నాగినీడు తమ పాత్రల మేరకు నటించారు.

vishwak sen
-సాంకేతికపరంగా
ఈ సినిమాకి లియోన్ జేమ్స్ అందించిన సంగీతం చక్కగా సరిపోయింది. తమిళ రాక్ స్టార్ అనిరుధ్ పాడిన పాట ప్రేక్షకులతో డ్యాన్స్ వేయిస్తుంది. విధు అయ్యనా ఫొటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. కొన్ని సన్నివేశాలు మినహా ఓవరాల్ గా ఓరి దేవుడా ప్రేమతో కూడిన వినోదాత్మక చిత్రం. ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు.
-ప్లస్ పాయింట్లు
ఫొటోగ్రఫీ
సంగీతం
నటీనటులు ప్రదర్శన
-మైనస్ పాయింట్లు
వీ ఎఫ్ ఎక్స్
సో సో గా సాగే స్క్రీన్ ప్లే
విశ్వక్ సేన్ అతి నటన
రొటీన్ కథ
సినిమా రేటింగ్: 2.5/5