Producer Chittibabu: విష్ణు చేసిన తప్పు అదే… మంచు బ్రదర్స్ గొడవల వెనకున్న సంచలన నిజాలు బయటపెట్టిన నిర్మాత!
Producer Chittibabu: గత మూడు రోజులుగా మంచు బ్రదర్స్ వార్ టాలీవుడ్ ని ఊపేస్తోంది. పరిశ్రమ పెద్దల్లో ఒకరిగా చలామణి అవుతున్న మోహన్ బాబు కుమారుల గొడవ రచ్చకెక్కింది. సారధి అనే వ్యక్తిని విష్ణు ఇంటికి వెళ్లి కొట్టబోయారు. అక్కడే ఉన్న మనోజ్ అది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. నా వాళ్ళ మీద విష్ణు దాడి చేస్తున్నాడు. ఇది సిట్యుయేషన్ అంటూ ఆరోపణలు చేశారు. మనోజ్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వీడియో […]


Producer Chittibabu
Producer Chittibabu: గత మూడు రోజులుగా మంచు బ్రదర్స్ వార్ టాలీవుడ్ ని ఊపేస్తోంది. పరిశ్రమ పెద్దల్లో ఒకరిగా చలామణి అవుతున్న మోహన్ బాబు కుమారుల గొడవ రచ్చకెక్కింది. సారధి అనే వ్యక్తిని విష్ణు ఇంటికి వెళ్లి కొట్టబోయారు. అక్కడే ఉన్న మనోజ్ అది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. నా వాళ్ళ మీద విష్ణు దాడి చేస్తున్నాడు. ఇది సిట్యుయేషన్ అంటూ ఆరోపణలు చేశారు. మనోజ్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. మోహన్ బాబు తేరుకుని మనోజ్ కి ఫోన్ చేసి వీడియో డిలీట్ చేయించాడు.
కొన్నాళ్లుగా మంచు కుటుంబంలో విబేధాలున్నాయని వార్తలు వస్తున్నాయి. మనోజ్ పోస్ట్ చేసిన వీడియోతో స్పష్టత వచ్చింది. ఇదిలా ఉంటే… మనోజ్-విష్ణు గొడవలో కీలకంగా మారిన ఈ సారథి ఎవరు? ఆయన చుట్టూ నెలకొన్న ఈ వివాదం ఏంటనే? సందేహాలు ఉన్నాయి. ఈ సంఘటన మీద టాలీవుడ్ సీనియర్ నిర్మాత చిట్టి బాబు స్పందించారు. మోహన్ బాబుతో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం రీత్యా… ఆ రోజు ఏం జరిగిందో, గొడవలు కారణాలు ఏమిటో వెల్లడించారు.
మంచు బ్రదర్స్ గొడవలకు ఆస్తులు కారణం కాదు. మోహన్ బాబు ఇద్దరు కొడుకులకు ఆస్తులు పంచేశారు. వాళ్లకు రావాల్సినది ఇచ్చేశారు. శ్రీవిద్యా నికేతన్ ని చూసుకునే బాధ్యత మంచు విష్ణుకు అప్పగించారు. ఒక విషయంలో సారధి విష్ణుకు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అది తేల్చకుండా సారధి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ పరిణామం విష్ణను ఆగ్రహానికి గురి చేసింది. ఆ రోజు సారధి ఇంటికి వెళ్లి గొడవపడ్డాడు. పక్కన ఉన్న తన అసిస్టెంట్ గజేంద్రతో పాటు మరొకరు ఆయన్ని ఆపారు.

Producer Chittibabu
ఆ సంఘటన మనోజ్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. విష్ణు నేరుగా సారధి ఇంటికి వెళ్లి గొడవపడటం తప్పు. ఒక ఫోన్ చేసి మోహన్ బాబుకు చెప్తే ఆయన చూసుకునేవారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మనోజ్ మరింత పెద్ద తప్పు చేశాడు. అలా వివాదం వెలుగులోకి వచ్చింది. మోహన్ బాబు కుటుంబ పరువు కోసం తాపత్రయ పడతారు. ఏదైనా నాలుగు గోడలు దాటి రానీయరు. ఇంట్లోనే మాట్లాడి సెటిల్ చేసుకుంటారు. ఇక సారధి మోహన్ బాబుకు అత్యంత సన్నిహితుడు. ఆయన పనులన్నీ చక్కబెట్టేది సారధే అని చిట్టి బాబు వెల్లడించారు.