ముందుకు సాగని విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ పనులు

రాష్ట్ర విభజన చట్టంలో కీలక అంశాలలో ఒకటైన విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ పనుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లిప్త ధోరణి ప్రదర్శిస్తూ ఉండడంతో గత ఆరేళ్లుగా ముందుకు సాగడం లేదు. నిధులు వచ్చినా సక్రమంగా ఖర్చు చేయలేని పరిష్టితులు నెలకొన్నాయి. ఎంతో,కొంత పనులు చేసిన కాంట్రాక్టర్లకు నగదు చెల్లిరపులు సక్రమంగా జరగడం లేదు. దీంతో ప్రాజెక్టుకు రుణాన్ని అందిస్తున్న ఆసియన్‌ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎడిబి) కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎడిబి విడుదల చేసిన వివరాల […]

  • Written By: Neelambaram
  • Published On:
ముందుకు సాగని విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ పనులు

రాష్ట్ర విభజన చట్టంలో కీలక అంశాలలో ఒకటైన విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ పనుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లిప్త ధోరణి ప్రదర్శిస్తూ ఉండడంతో గత ఆరేళ్లుగా ముందుకు సాగడం లేదు. నిధులు వచ్చినా సక్రమంగా ఖర్చు చేయలేని పరిష్టితులు నెలకొన్నాయి.

ఎంతో,కొంత పనులు చేసిన కాంట్రాక్టర్లకు నగదు చెల్లిరపులు సక్రమంగా జరగడం లేదు. దీంతో ప్రాజెక్టుకు రుణాన్ని అందిస్తున్న ఆసియన్‌ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎడిబి) కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎడిబి విడుదల చేసిన వివరాల ప్రకారం కారిడార్‌ నిర్మాణానికి ఆ బ్యాంకు 245 మిలియన్‌ డాలర్ల రుణం (సుమారుగా రూ 1820 కోట్లు) కేటాయించింది. ఇప్పటివరకు ఇందులో 178 మిలయన్‌ డాలర్ల (రూ 1322 కోట్లు) కాంట్రాక్ట్‌లు ఖరారుచే శారు.

దీనిలో కూడా దాదాపు 88 మిలియన్‌ డాలర్లు (రూ 653 కోట్లు) మాత్రమే కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరిగాయి. దీనివల్ల కాంట్రాక్టర్లు కూడా పనులను జాప్యం చేస్తున్నారు. పనులు, పరికరాలకు రెండు వందల మిలియన్‌ డాలర్లను కేటాయించగా, అంధులో 173 మిలియన్‌ డాలర్లకు కాంట్రాక్ట్‌లు ఖరారు చేశారు. అయితే ఇప్పటివరకు 51 మిలియన్‌ డాలర్లు మాత్రమే పంపిణీ చేసినట్లు తేల్చారు.

2019 సంవత్సరానికి సంబందించి 21 మిలియన్‌ డాలర్ల విలువైన కాంట్రాక్ట్‌లు మంజూరు చేయగా, పాత నిధులతో కలిపి 66 మిలియన్‌ డాలర్ల పనులు చేయాల్సి ఉంది. అయితే 32 మిలియన్‌ డాలర్ల పనులు మాత్రమే జరిగాయి. ఈ ఏడాది 56 మిలియన్‌ డాలర్ల విలురవైన పనులు జరగాల్సి ఉండగా, అతి తక్కువగా కేవలం 3.5 మిలియన్‌ డాలర్ల పనులు మాత్రమే జరిగాయి.

2017 నురచి ఈ ప్రాజెక్టు కోసం తొమ్మిది దశల్లో కాంట్రాక్ట్‌లు ఖరారు చేశారు. తొలుత 2017 జూన్‌లో 21.75 మిలియన్‌ డాలర్లతో కాంట్రాక్ట్‌ ఖరారు చేయగా, అందులో ఇప్పటివరకు 44 శాతం పనులు మాత్రమే జరిగాయి. 2018 మార్చిలో కేటాయించిన 11 మిలియన్‌ డాలర్ల పనుల్లో 78 శాతం పూర్తికాగా, అదే ఏడాది ఫిబ్రవరిలో కేటాయించిన 51 మిలియన్‌ డాలర్ల పనుల్లో 56 శాతం పూర్తయ్యాయి. ఆ తరువాత పనులు మాత్రం పూర్తిగా మందగించాయి.

2018 మార్చి 14, జూన్‌ ఐదు, జూన్‌ 26, సెప్టెంబర్ 1, అక్టోబర్‌ 18న కేటాయించిన పనుల్లో ప్రగతి నామమాత్రంగా కనిపిస్తోంది. ముందుగా అనుకున్న మేరకు ఈ పనుల్లో ఐదు పనులు 2019లోనే పూర్తికావాల్సి ఉన్నప్పటికీ, పనుల్లో జాప్యం కారణంగా లక్ష్యాన్ని ఈ ఏడాదికి మార్పు చేశారు. అయినప్పటికీ లక్ష్యాన్ని సాధించడం కష్టంగానే కనిపిస్తోంది.

2018లో కేటాయించిన వాటిల్లో మూడు పనుల శాతం ఇంకా సింగిల్ డిజిట్‌లోనే ఉండటం గమనార్హం. కాగా సివిల్‌ పనులను చేస్తున్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యం కారణంగా పెద్ద సంఖ్యలో కూలీలను కూడా తొలగించే పరిస్థితి కనిపిస్తోందని ఎడిబి చేసిన వ్యాఖ్యలు ఆరదోళన కలిగిస్తున్నాయి.

సంబంధిత వార్తలు