Virat Kohli Dance: వైరల్ వీడియో; విరాట్ కోహ్లీ ఇలా ఊర్వశి లాగా డ్యాన్స్ చేయడం మీరు ఎప్పుడైనా చూశారా?
బాలీవుడ్ నటిమణి అనుష్కా శర్మ ను పెళ్లి చేసుకున్న తర్వాత విరాట్ పూర్తిగా మారిపోయాడు. ఆగ్రహం విషయంలో తగ్గకపోయినప్పటికీ పార్టీ బర్డ్ గా మారిపోయాడు.

Virat Kohli Dance: విరాట్ కోహ్లీ అంటే మనకు ఏం గుర్తుకొస్తుంది? మైదానం లోపల అతడు చేసే వీరవిరాటం గురించి, బౌలర్లను చితక్కొట్టే తీరు గురించే మనకు జ్ఞప్తికి వస్తుంది.. తిక్క రేగితే ప్రత్యర్థి జట్టు సభ్యులను నోటికి వచ్చినట్టు తిట్టడమే మన కళ్ళ ముందు మెదులుతుంది. మరి అలాంటి విరాట్ కోహ్లీ లో మనకు కనిపించని ఇంకో కోణం కూడా ఉంది.. అదే అతడి డ్యాన్స్.. అంతకుముందు ఫైర్ బ్రాండ్ లాగా ఉండే విరాట్ కోహ్లీ.. ఏ ముహూర్తాన అనుష్క శర్మ చేసుకున్నాడో గాని పక్కా ప్రొఫెషనల్ డ్యాన్సర్ అయిపోయాడు.
మైదానంలో రెచ్చిపోయాడు
ఏదో టోర్నీ సందర్భంగా విరాట్ కోహ్లీ మైదానంలో తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. విరాట్ కోహ్లీ గురించి తెలిసిందే కదా.. అతడు ఫిట్నెస్ కు ఎంతటి ప్రాధాన్యమిస్తాడో.. తినే తిండి దగ్గర నుంచి తాగే నీరు వరకు ప్రతి విషయంలో కొలతలు పాటిస్తాడు. అంతేకాదు ఆరోగ్యం విషయంలో పకడ్బందీగా ఉంటాడు. అలాంటి విరాట్ కోహ్లీ మైదానంలో సాధన చేసుకుంటూ డ్యాన్స్ చేశాడు. అది కూడా అల్లా టప్పా డ్యాన్స్ కాదు.. ప్రొఫెషనల్స్ కూడా అసూయపడేలా, బాలీవుడ్ ఐటం బాంబ్ ఊర్వశి(ఎందుకంటే అతడు ఎంచుకున్న పాట అటువంటిది) రూతేలా చివుక్కునేలా డ్యాన్స్ చేశాడు.. రెండు కాళ్ళను అటు ఇటు కదుపుతూ అద్భుతమైన స్టెప్పులు వేసి “మర్ డాలా” పేరుతో కవితా కృష్ణమూర్తి పాడిన పాటకు మరింత అందం తీసుకొచ్చాడు.
అనుష్కను చేసుకున్న తర్వాత
బాలీవుడ్ నటిమణి అనుష్కా శర్మ ను పెళ్లి చేసుకున్న తర్వాత విరాట్ పూర్తిగా మారిపోయాడు. ఆగ్రహం విషయంలో తగ్గకపోయినప్పటికీ పార్టీ బర్డ్ గా మారిపోయాడు. అప్పుడప్పుడు కాలు కదపడం కూడా మొదలుపెట్టాడు. అది కూడా ప్రొఫెషనల్ డ్యాన్స్ లాగా చేస్తున్నాడు. అయితే ఇలాంటి వీడియోలు మొన్నటి వరకు వెలుగు చూడలేదు. ఇటీవల మైదానంలో విరాట్ కోహ్లీ స్టెప్పులు వేయడంతో దానిని కొంతమంది ప్రేక్షకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది.. ఈ వీడియో చూసినవారు నేరుగా అనుష్క శర్మకు ట్యాగ్ చేస్తున్నారు..” ఊర్వశి లాగా విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేస్తున్నాడు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.. అయితే ఈ వ్యాఖ్యల పట్ల అనుష్క శర్మ ఎటువంటి రిప్లై ఇవ్వకపోయినప్పటికీ.. తన భర్త డ్యాన్స్ చూసి మనసులో ముసి ముసి నవ్వులు నవ్వుకునే ఉంటుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
అది కూడా ఫిట్నెస్
అయితే విరాట్ కోహ్లీ డ్యాన్స్ మీద కొంతమంది అభిమానులు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఫిట్నెస్ కాపాడుకునేందుకు విరాట్ కోహ్లీ దేన్నీ వదిలిపెట్టడని, చివరికి డ్యాన్సును కూడా తన ఫిట్నెస్ కు అనుకూలంగా మార్చుకున్నాడని అంటున్నారు. డాన్స్ వల్ల శరీరంలో ప్రతి అవయవం కదులుతుందని, భారీగా క్యాలరీలు ఖర్చు అవుతాయని వారంటున్నారు. జిమ్ లో ఉక్క పోత మధ్య కసరత్తులు చేసే బదులు, డ్యాన్స్ చేసుకుంటూ ఫిట్ నెస్ ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడని వ్యాఖ్యానిస్తున్నారు.
View this post on Instagram
