Virat Kohli: లక్షల మంది ముందు కాళ్లు మొక్కేశాడు.. విరాట్ కోహ్లీ గొప్పతనం ఇదే!
Virat Kohli: టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. ఐపీఎల్‌లో పరుగులు వర్షం కురిపిస్తున్న విరాట్ తన అగ్రెసివ్‌తోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా గౌతమ్ గంభీర్, నవీన్ ఉల్ హక్‌ల గొడవలతో కోహ్లీలోని దందుడకుతనం మరోసారి నిరూపితమైంది. అయితే తనలో అగ్రెసివ్ నెస్ మాత్రమే కాదు.. మంచి మనసు కూడా దాగుందని కింగ్ కోహ్లీ రుజువు చేశాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ప్రారంభానికి ముందు కోహ్లి తన చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్‌శర్మను […]

Virat Kohli: టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. ఐపీఎల్‌లో పరుగులు వర్షం కురిపిస్తున్న విరాట్ తన అగ్రెసివ్‌తోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా గౌతమ్ గంభీర్, నవీన్ ఉల్ హక్‌ల గొడవలతో కోహ్లీలోని దందుడకుతనం మరోసారి నిరూపితమైంది. అయితే తనలో అగ్రెసివ్ నెస్ మాత్రమే కాదు.. మంచి మనసు కూడా దాగుందని కింగ్ కోహ్లీ రుజువు చేశాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ప్రారంభానికి ముందు కోహ్లి తన చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్‌శర్మను కలుసుకున్నాడు విరాట్. తన క్రికెట్ కెరీర్‌కు పునాది వేసిన ఆయన కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ అరుదైన సన్నివేశానికి అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక అయింది. రాజ్‌కుమార్ శర్మ మైదానంలోకి రాగానే ప్రాక్టీసును సైతం ఆపేసి మరీ గురువ దగ్గరకు వచ్చాడు కింగ్. ఎంతో వినయంగా ఆయన పాదాలకు నమస్కరించాడు. కోహ్లీ విధేయత పట్ల సంతోషించిన కోచ్ విరాట్ వీపు తట్టి దీవెనలు అందించాడు. ఆపై ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. వీరిద్దరూ చాట్‌లో నిమగ్నమయ్యారు. కోహ్లీ కూడా అతని పేరు మీద ఉన్న స్టేడియంలో స్టాండ్ వైపు చూపించాడు.
A wholesome meet & greet @imVkohli catches up with his childhood coach #TATAIPL | #DCvRCB | @RCBTweets pic.twitter.com/YHifXeN6PE
— IndianPremierLeague (@IPL) May 6, 2023
