Virat Kohli Instagram: విరాట్ సరికొత్త రికార్డు.. ఆసియా ఖండంలోనే ఏకైక ఆటగాడు కోహ్లీ..!

భారత జట్టు తరపున ఇన్స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రికెటర్ గాను కోహ్లీ రికార్డులకు ఎక్కాడు. ఈ లెజెండ్ క్రికెటర్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేకపోవడం గమనార్హం. ఆసియా ఖండంలో అన్ని క్రీడల్లోని ఆటగాళ్లు కలుపుకున్నా కోహ్లీనే అగ్రస్థానంలో కొనసాగుతుండగా,

  • Written By: BS Naidu
  • Published On:
Virat Kohli Instagram: విరాట్  సరికొత్త రికార్డు.. ఆసియా ఖండంలోనే ఏకైక ఆటగాడు కోహ్లీ..!

Virat Kohli Instagram: టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. క్రికెట్లో రికార్డులు అంటే టక్కున గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లీ మాత్రమే. అటువంటి విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత దక్కించుకున్నాడు. ఇటీవల ఐపీఎల్ లో రెండు వరుస శతకాలతో అభిమానులను అలరించిన కోహ్లీ.. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో 250 మిలియన్ ఫాలోవర్లను సంపాదించాడు. ఆసియా ఖండం నుంచి ఈ ఘనత సాధించిన ఒకే ఒక్కడిగా కోహ్లీ సరికొత్త రికార్డులు సృష్టించాడు.

భారత జట్టు తరపున ఇన్స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రికెటర్ గాను కోహ్లీ రికార్డులకు ఎక్కాడు. ఈ లెజెండ్ క్రికెటర్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేకపోవడం గమనార్హం. ఆసియా ఖండంలో అన్ని క్రీడల్లోని ఆటగాళ్లు కలుపుకున్నా కోహ్లీనే అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ప్రపంచ క్రికెట్ లోనూ కోహ్లీ స్థాయిలో ఫాలోవర్స్ మరో క్రికెటర్ కలిగి లేడు. కోహ్లీ తర్వాత మహేంద్రసింగ్ ధోని 42.2 మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉన్నాడు. ఇక టీమిండియా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కు ఇన్స్టాలో 40.3 మిలియన్ ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. వీరికంటే అనేక రెట్లు ఎక్కువగా విరాట్ కోహ్లీ ఫాలోవర్స్ ను కలిగి ఉండి సరికొత్త రికార్డులను సృష్టించాడు.

టాప్ లో ఉన్న ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో..

ఈ జాబితాలో పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన క్రీడాకారుడిగా టాప్ లో ఉన్నాడు. రోనాల్డోను ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అయ్యే వారి సంఖ్య 585 మిలియన్లు. రోనాల్డో తర్వాత లియోనల్ మెస్సీ 462 మంది మిలియన్ ఫాలోవర్స్ తో రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ వీరికి దూరంగా ఉన్నప్పటికీ.. ఆసియా ఖండంలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రీడాకారులుగా రికార్డు నేలకొల్పాడు.

తాజా ఐపీఎల్ లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో ఆర్సిబి ప్లే ఆఫ్ చేరడంలో మరోసారి విఫలమైంది. ఈ సీజన్ లో మంచి విజయాలు నమోదు చేసినప్పటికీ ప్లే ఆఫ్ లో అడుగు పెట్టలేకపోయింది. అయితే, విరాట్ కోహ్లీ మాత్రం వ్యక్తిగతంగా అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ సీజన్ లో రెండు సెంచరీలు సహా ఐదు అర్థ సెంచరీలతో అదరగొట్టాడు విరాట్ కోహ్లీ. మొత్తంగా 14 మ్యాచ్ ల్లో 700కు పైగా పరుగులు సాధించి తన సూపర్ ఫామ్ ను కంటిన్యూ చేశాడు. క్రికెట్ లో ఇప్పటి వరకు తన పేరుతో ఎన్నో రికార్డులను నెలకొల్పిన విరాట్ కోహ్లీ.. తాజాగా ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్యను భారీగా పెంచుకొని ఆసియా ఖండంలో తనకు మరో ఆటగాడు దగ్గర్లోనే లేకుండా సరికొత్త రికార్డును సృష్టించాడు. క్రికెట్ నుంచి ఈ స్థాయి ఫాలోవర్స్ కలిగిన మరో ఆటగాడు ప్రపంచంలోనే లేడని పలువురు పేర్కొంటున్నారు. కోహ్లీ సాధించిన ఈ రికార్డు పట్ల అభిమానులు ఎంతగానో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కింగ్ కోహ్లీ అంటే ఆ మాత్రం ఉంటుందని పలువురు అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయాన్ని అభిమానులు పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు