Virat Kohli : RCB పాలిట శాపంగా మారుతున్న విరాట్ కోహ్లీ!
ఐపీఎల్ 2023లో కోహ్లీ స్ట్రైక్‌రేట్ క్రమంగా తగ్గుతూ వస్తోంది. సీజన్ ప్రారంభంలో 140గా ఉన్న స్ట్రైక్‌రేట్ 75 శాతం లీగ్ మ్యాచ్‌లు ముగిశాక 120కి పడిపోయింది.

Kohli Slow Batting: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో బ్యాట్స్‌మెన్ల్ స్ట్రైక్ రేట్లు జట్టు విజయంలో కచ్చితంగా కీలకపాత్ర పోషిస్తాయి. కీలక బ్యాట్స్‌మెన్ల స్ట్రైక్‌రేట్ పడిపోతే.. జట్టును గెలిపించడం చాలా కష్టం. ఇప్పుడు ఆర్బీసీ(రాయల్ చాలెంజ్ బెంగళూరు) జట్టు కీలక ఆటగాడు, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పరిస్థితి అలాగే ఉంది. పడిపోతున్న కోహ్లీ స్ట్రైక్ రేట్ పడిపతుండడంతో ఆ జట్టు విజయాలు తగ్గి ఓటములు పెరుగుతున్నాయి.
తరచూ చర్చ..
ఐపీఎల్‌లో, టీ20 క్రికెట్‌లో స్ట్రైక్‌రేట్లు తరచుగా చర్చనీయాంశంగా ఉంటాయి. కేఎల్ రాహుల్, కేన్ విలియమ్సన్, ధోనీ, రోహిత్ శర్మ, ఇలా అనేక మంది తరచూ స్ట్రైక్‌రేట్ల విషయంలో విమర్శలను ఎదుర్కొన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 75 శాతం లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు బ్యాట్స్‌మన్ల స్ట్రైక్‌రేట్ మళ్లీ చర్చనీయంశమైంది. ముఖ్యంగా ఆర్బీసీ స్టార్ ఆటగాడు కోహ్లీ స్ట్రైక్‌రేట్ పడిపోవడం ఆ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది.
140 ఉంటేనే గెలుపు..
ఐపీఎల్‌లో ఏ జట్టు అయినా గెలవాలి అంటే కనీసం ఇద్దరు, ముగ్గురు బ్యాట్స్‌మెన్ల స్ట్రైక్‌రేట్ 140కిపైగా ఉండాలి. అప్పుడే భారీ స్కోర్ చేయడం అయినా.. భారీ స్కోర్‌ను ఛేజ్ చేయడం అయినా సాధ్యం అవుతుంది.
పడిపోయిన కోహ్లీ స్ట్రైక్‌రేట్..
ఐపీఎల్ 2023లో కోహ్లీ స్ట్రైక్‌రేట్ క్రమంగా తగ్గుతూ వస్తోంది. సీజన్ ప్రారంభంలో 140గా ఉన్న స్ట్రైక్‌రేట్ 75 శాతం లీగ్ మ్యాచ్‌లు ముగిశాక 120కి పడిపోయింది. దీంతో సీజన్ ప్రారంభంలో వరుస విజయాలతో దూసుకుపోయిన ఆర్బీసీ ఇప్పుడు.. వరుస ఓటములు మూటగట్టుకుంటోంది. అయితే ప్రతీమ్యాచ్‌లో 140 ఉండాల్సిన అవసరంం లేదు. కానీ, భారీ లక్ష్యలు ఛేదించే క్రమంలో.. భారీ స్కోర్ చేసే క్రమంలో కచ్చితంగా 140కిపైగా ఉంటే.. జట్టు విజయావకాశాలు మెరుగుపడతాయి.
కోహ్లీ స్లో బ్యాటింగ్ పై ట్రోల్స్
ఒకటి రెండు మ్యాచ్‌ల్లో హిట్టింగ్ చేయడం తర్వాతి మ్యాచ్ లకు 120 కంటే తక్కువ స్ట్రైక్ రేట్ బ్యాటింగ్ చేయడం ఈ సీజన్‌లో కోహ్లీ బ్యాటింగ్ తీరు ఇలా కొనసాగుతోంది. ఢిల్లీతో జరిగిఇన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ స్లో బ్యాటింగ్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ ట్వీట్ అవుతున్నాయి. 50 కోసం, రికార్డుల కోసం ఆడితే మ్యాచ్ గెలవలేమని కొంతమంది ఫ్యాన్స్ కోహ్లీ బ్యాటింగ్ అప్రోచ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 46 బంతుల్లో 55 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో పలుమార్లు కోహ్లీ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 120లోపే ఉంది. ఇక 2020.2021,2021 సీజన్లలో కూడా ఐపీఎల్ లో కోహ్లీ స్ట్రైక్ రేట్ 120కు అటు ఇటుగానే ఉంది. అయితే కోహ్లీ మాత్రం టీ20 మ్యాచ్‌లోని మొదటి పవర్‌ప్లే పూర్తయిన తర్వాత బ్యాటర్లు ఎందుకు నెమ్మదిగా ఆడతారో అర్థం చేసుకోవడం బయటి వ్యక్తులకు కష్టమని వ్యాఖ్యానించాడు.
