Virat Kohli- Faf Du Plessis: ఐపీఎల్ 2023: మరో రికార్డు సమం చేసిన బెంగళూర్ జోడీ.. వారెవరంటే..!
ఐసీఎల్ సీజన్ 16లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య గురువారం ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ, డూప్లెసిస్ జోడీ మరో రికార్డు సమం చేశారు.

Virat Kohli- Faf Du Plessis: ఐపీఎల్‌లో రికార్డుల పరంపర కొనసాగుతోంది. పాత రికార్డులు బద్ధలవుతున్నాయి. కొన్ని రికార్డులు సమం చేస్తున్నారు. ఇటీవల బెంగళూరుకు చెందిన క్రికెటర్లు డూప్లెసిస్, మాక్స్‌వెల్ ద్వయం గతంలో వారు చేసిన అత్యధిక పరుగుల భాగస్వామ్యం రికార్డును వారే బద్దలు కొట్టారు. తాజాగా కోహ్లీ, డూప్లెసిస్ జోడీ మరో రికార్డును సమయం చేసింది.
హైరాబాద్ మ్యాచ్‌లో..
ఐసీఎల్ సీజన్ 16లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య గురువారం ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ, డూప్లెసిస్ జోడీ మరో రికార్డు సమం చేశారు. ఈ మ్యాచ్ ద్వారా అత్యధికసార్లు 50 పరుగుల భాగస్వామ్యం ఎక్కువసార్లు(7) నమోదు చేసిన క్రికెటర్లుగా నిలిచారు. గతంలో ఈ రికార్డు వార్నర్, బెయిన్‌స్టో పేరిట ఉంది. 2019లో ఈ జోడీ 50, అంతకంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యం ఏడుసార్లు నమోదు చేశారు. 2021లో డూప్లెసిస్, రుతురాజ్ జోడీ కూడా ఏడుసార్లు 50, అంతకంటే ఎక్కువ భాగస్వా్యం నెలకొల్సింది. తాజాగా కోహ్లీ, డూప్లెసిస్ జోడీ ఆ రికార్డును సమయం చేసింది.
నాలుగుసార్లు 100 ప్లస్ భాగస్వా్యం..
కోహ్లీ, డూప్లెసిస్ జోడీ 100, అంతకంటే ఎక్కవ పరుగుల భాగస్వామ్యం కూడా 4 సార్లు నెలకొల్పి, ఆ రికార్డును తమ పేరిట లిఖించుకున్నారు. ఓపెనింగ్ భాగస్వామ్యంలో అరుదైన రికార్డు నెలకొల్పారు. తాజాగా 50, అంతకంటే ఎక్కువ పరుగులు కూడా చేసి సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ఉన్నందున ఈ రికార్డు కూడా బద్దలయ్యే అవకాశం ఉంది.
సన్‌రైజర్స్‌పై బెంగళూరు ఘన విజయం..
ఇక హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఆరెంజ్ ఆర్మీ తరఫున హెన్రిచ్ క్లాసెన్(104, 51 బంతుల్లో; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) సూపర్ సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ మార్క్రమ్(18) మరోసారి విఫలమైనా.. హ్యారీ బ్రూక్ 27(నాటౌట్) పరుగులతో పర్వాలేదనిపించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆర్‌సీబీకి ఎదురులేని శుభారంభంతో పాటు 172 పరుగుల భాగస్వామ్యం లభించింది. కెప్టెన్ ఫాఫ్ డూ ప్లెసిస్(71), కోహ్లీ(100) నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్ వచ్చాయి. ఇక వీరిద్దరు పెవీలియన్ చేరాక మిగిలి ఉన్న లక్ష్యాన్ని గ్లెన్ మ్యాక్స్‌వెల్(5, నాటౌట్), మైకేల్ బ్రేస్‌వెల్(4, నాటౌట్) పూర్తి చేశారు. ఫలితంగా ఆర్‌సీబీ ఈ మ్యాచ్‌లో గెలిచి తన ప్లేఆఫ్ ఆశలను కాపాడుకుంది. ఆర్‌సీబీ తన చివరి మ్యాచ్‌ను ఈ నెల 21న గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. ఆ మ్యాచ్‌లో కూడా ఆర్‌సీబీ గెలిస్తే ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో ప్రవేశించే అవకాశం ఉంటుంది.
