Virat Kohli: టీ20లకు పనికిరాడన్నారు.. కానీ అదే కోహ్లీ ‘సమాధానమిచ్చాడు

విరాట్ కోహ్లి గతంలో టీమిండియా కెప్టెన్ గా ఉన్న విషయం తెలిసిందే. ఆయన కాలంలో జట్టు వరుస ఓటములను మూటగట్టుకుంది. సభ్యులు ఎలా ఆడినా బాధ్యత కెప్టెన్ దే ఉంటుంది. అందువల్ల ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

  • Written By: SS
  • Published On:
Virat Kohli: టీ20లకు పనికిరాడన్నారు.. కానీ అదే కోహ్లీ ‘సమాధానమిచ్చాడు

Virat Kohli: ఐపీఎల్ 2023 ఎన్నో ప్రత్యేకతలు చాటుకుంటోంది. ఈ సీజన్లో కొందరు ఆటగాళ్లు తమ ప్రదర్శనతో అదరగొడుతున్నారు. ఇన్నాళ్లు విమర్శల ఎదుర్కొన్నవారు ఇప్పుడు ప్రశంసలు పొందుతున్నారు. తాము ఎందుకు పనికిరాని క్రికెటర్ అని అనిపిపంచుకున్నవారు.. ఇప్పుడు క్రికెట్ హీరో అని కీర్తిస్తున్నారు. ఈ సీజన్లో మొన్నటి వరకు సూర్యకుమార్ యాదవ్, శుభ్ మన్ గిల్ లాంటి పేర్లు ప్రత్యేకంగా నిలిచాయి. లేటేస్టుగా కోహ్లి.. కోహ్లి.. అంటూ క్రీడాకారులు నినాదం చేస్తున్నారు. నిన్న రాత్రి సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లి రెండో శతకాన్ని చేశాడు. దీంతో ఈ సీజన్లో మొదటి స్థానాన్ని చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

విరాట్ కోహ్లి గతంలో టీమిండియా కెప్టెన్ గా ఉన్న విషయం తెలిసిందే. ఆయన కాలంలో జట్టు వరుస ఓటములను మూటగట్టుకుంది. సభ్యులు ఎలా ఆడినా బాధ్యత కెప్టెన్ దే ఉంటుంది. అందువల్ల ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా వాటిని తట్టుకొని కోహ్లి ముందుకెళ్లాడు. ఒక దశలో ఆయనను కెప్టెన్ నుంచి తొలగించాలని కొందరు బహిరంగంగానే కామెంట్స్ చేశారు. కానీ వ్యక్తిగతంగా కోహ్లికి విపరీత అభిమానులు ఉన్నారు. క్రికెట్ మహామహుల రికార్డులను ఆయన ఛేదించాడు. తాజాగా వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్ రికార్డును కోహ్లి అధిగమించడంతో అభిమానులు ఆయనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ఈ సందర్బంగా కోహ్లి మాట్లాడుతూ నేను అన్ని ఫార్మాట్లలో ఆడి ప్రతాపం చూపించాను. అయితే ట్వింటీ 20 ఫార్మాట్ లో నా పని అయిపోయిందని అన్నారు. ఇక నన్ను పనికి రాడని అన్నారు.. కానీ నాకు బౌండరీలను తాకించడం అంటే చాలా ఇష్టం. పరిస్థితులకు తగ్గట్లుగా చివర్లో భారీ షాట్లకు ప్రయత్నిస్తానని అన్నాడు. ఏ ఫార్మట్లలో అయినా పరిస్థితులకు తగ్గట్లు ఆడడం ఇంపార్టెంట్. ప్రస్తుతం నా బ్యాటింగ్ పై నేను సంతృప్తితో ఉన్నా.. వాస్తవానికి స్పిన్ లో బౌండరీలు దాటించడం చాల కష్టం. కానీ వర్షం గురించి ఏమాత్రం ఆలోచించకుండా జట్టు కోసం నా శాయశక్తుల కృషి చేశానని విరాట్ చెప్పారు.

ఆర్సీబీ ఈ మ్యాచ్ లో197 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి 101 నాటౌట్ గా నిలిచారు. కోహ్లి తరువాత రావ్ 23 చేశారు. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు, మహ్మద్ షమీ, యశ్ దయాల్, రషీద్ ఖాత్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఐదు వికెట్లు కోల్పోయిన తరువాత అనూజ్ రావత్ తో కలిసి కోహ్లి చేసిన పోరాటమే జట్టు విజయానికి చేరింది. ఈ సమయంలో ఏ జట్టు క్రీడాకారుడు సెంచరీ కొట్టాలని అనుకోడు. కానీ కోహ్లి సాయంతో జట్టు విజేతగా నిలిచింది.

సంబంధిత వార్తలు