Elephant Statue : భారతదేశం అంటేనే విభిన్న మతాల భూమి. దైవానుగ్రహం కోసం ప్రజలు తరచుగా దేవాలయాలు.. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కొన్నిసార్లు, ప్రజలు దేవతలను సంతోషపెట్టడానికి ప్రత్యేకమైన.. సవాలు విసిరే పనిని చేయడానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ, ఇది ఎల్లప్పుడూ వారికి అనుకూలంగా సాగదు. అప్పుడప్పుడు ఇలాంటి వింతలు విశేషాలు జరగొచ్చు.
గుజరాత్ ఆలయంలో ఏనుగు విగ్రహం కింద ఒక భక్తుడు చిక్కుకున్నాడు.ఎరక్కపోయి ఇరుక్కున్నాడు ఈ భక్తుడు. సాధారణంగా భారతదేశంలో ముఖ్యంగా హిందువుల్లో నమ్మకాలు ఎక్కువ. శివుడి ముందు నంది పాదాల కింద నుంచి దాటుతాం.. ఆలయంలోని సందుల్లో దూరుతాం. దేవుడు కొలువైన కొండకోనల్లో గుహల్లోకి వెళ్లి నానా సాహసాలు చేస్తాం. సెంటిమెంట్ కు అనుగుణంగా ఎన్నెన్నో చేస్తూ భక్తిని చాటుతుంటాం.
చిన్న ఏనుగు విగ్రహం నుంచి దాటాలని తల శరీరాన్ని దాటించిన యువకుడు నడుం వరకూ వచ్చేసరికి పోవడం సాధ్యం కాక ఇరుక్కుపోయాడు. ఏనుగు విగ్రహం కింద అడ్డంగా బుక్కైపోయాడు.దాని నుండి బయటపడటానికి చాలా ప్రయత్నించాడు. ఓ ట్విట్టర్ వినియోగదారు షేర్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఈ ఏనుగు కాళ్ల కింద నుండి బయటకు రావడానికి ఆ మనిషి తన చేతులు ,శరీరాన్ని అటూ ఇటూ కదుపుతూ బయటపడడానికి తెగ ప్రయత్నించాడు. కానీ ప్రయోజనం లేకుండా లేకుండా పోయింది. వీడియో సాగుతున్న కొద్దీ పూజారి కూడా వ్యక్తి విగ్రహం నుండి బయటకు రావడానికి సహాయం చేస్తాడు. చాలా మంది సందర్శకులు భక్తులకు సూచనలు, సలహాలు ఇవ్వడం కనిపిస్తుంది. ఆ ఇరుక్కుపోయిన వ్యక్తి తన శరీరాన్ని అటూ ఇటూ తిప్పుతూ బయటపడడానికి నానా తిప్పలు పడ్డాడు. ప్రజలు కూడా అతడికి సహాయం అందిస్తారు. కానీ మనిషి ఏనుగు కింద నుంచి బయటకు రాలేకపోయాడు. భక్తి కోసం ఇలా దుస్సహాసానికి పాల్పడి అనవసరంగా ఈ భక్తుడు ఇరుక్కుపోయాడు.
ఆ వ్యక్తి విగ్రహం నుంచి బయటకు వచ్చాడా అనేది వీడియోలో స్పష్టంగా లేదు. షేర్ చేసినప్పటి నుండి, వీడియో వైరల్ అయ్యింది. దాదాపు లక్ష కంటే ఎక్కువ మంది చూస్తూ దీన్ని షేర్ చేస్తున్నారు.
ఆ దేవాలయం ఆచారంలో భాగంగా చిన్న ఏనుగు విగ్రహం కాళ్ల మధ్య నుంచి వెళితే మంచి జరుగుతుందని అక్కడి భక్తుల నమ్మకం. ఒక మహిళా భక్తురాలు కూడా 2019లో ఇరుక్కుపోవడంతో ఇలాంటి సంఘటన ఒకటి ఇదివరకూ జరిగింది. ఆమె విగ్రహం నుండి బయటకు వచ్చేందుకు కూడా ప్రయత్నించింది. ఆమెను రక్షించడానికి చాలా మంది వచ్చారు.
పాత వీడియో ప్రకారం, కొద్దిసేపు పెనుగులాట తర్వాత ఆమె గాయపడకుండా తప్పించుకోగలిగింది. ఆమె ప్రయత్నాలకు చప్పట్లు కొట్టి ఉత్సాహపరిచిన ఆమె తోటి భక్తులకు ఇప్పుడు మరో వ్యక్తి ఇరుక్కుపోవడం మాత్రం కంగారుపెట్టింది.
Any kind of excessive bhakti is injurious to health 😮 pic.twitter.com/mqQ7IQwcij
— ηᎥ†Ꭵղ (@nkk_123) December 4, 2022