Thangalan Teaser Review : తంగలాన్ టీజర్ రివ్యూ : రా అండ్ రస్టిక్ రోల్ లో విక్రమ్, కథలో అసలు ట్విస్ట్ అదే!
కబాలి, కాలా, సర్పట్టా చిత్రాలతో పా రంజిత్ చిత్ర పరిశ్రమ దృష్టికి ఆకర్షించాడు. అప్పట్లో కబాలి అత్యంత హైప్ మధ్య విడుదలైంది.

Thangalan Teaser Review : విక్రమ్ దేశం మెచ్చిన నటుల్లో ఒకరు. ఇక డార్క్ అండ్ రస్టిక్ డ్రామాలకు దర్శకుడు పా రంజిత్ పెట్టింది పేరు. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం తంగలాన్. పీరియాడిక్ రివల్యూషనరీ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో విక్రమ్ గెటప్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుంది. ఆటవిక జాతికి చెందిన డీగ్లామర్ రోల్ లో ఆయన గుర్తు పట్టలేనంతగా తయారయ్యారు. పాత్రల గెటప్స్, సినిమా నేపథ్యం సినిమాకు ప్రచారం తెచ్చిపెట్టింది.
నేడు తంగలాన్ టీజర్ విడుదల చేశారు. టీజర్లో కథపై ఒక హింట్ ఇచ్చారు. ఇది బంగారం కోసం జరిగే యుద్ధం అని అంచనా వేయవచ్చు. ఓ ఆటవిక జాతి నివసించే ప్రాంతంలో దొరికే బంగారంపై విదేశీయులు కన్నేస్తారు. వారి స్వార్థం కోసం అమాయక జనాలను బలి చేయాలని చూస్తారు. వారి బానిస సంకెళ్ళ నుండి విముక్తి కోసం తెగలోని ఒకడు తిరగబడతాడు. అందరినీ కూటగట్టి యుద్దానికి సిద్ధం అవుతాడు.
తమకంటే బలవంతులైన వారిపై తంగలాన్ పోరాటం ఎలా సాగింది? అతడు తనను, తన జాతిని కాపాడుకున్నాడా? అన్నదే కథలో ట్విస్ట్. విక్రమ్ పాత్ర మొరటుగా ఉంది. రా అండ్ రస్టిక్ రోల్ లో విక్రమ్ జీవించినట్లు ఉన్నారు. గతంలో విక్రమ్ శివపుత్రుడు, అపరిచితుడు, ఐ చిత్రాల్లో ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేసిన మెప్పించాడు. తంగలాన్ గా విక్రమ్ మరోసారి మెస్మరైజ్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
కబాలి, కాలా, సర్పట్టా చిత్రాలతో పా రంజిత్ చిత్ర పరిశ్రమ దృష్టికి ఆకర్షించాడు. అప్పట్లో కబాలి అత్యంత హైప్ మధ్య విడుదలైంది. వసూళ్ళ పరంగా కూడా భేష్ అనిపించింది. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, పార్వతి, పశుపతి కీలక రోల్స్ చేస్తున్నారు. కే ఈ జ్ఞానవేల్ రాజా నిర్మాతగా ఉన్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. 2024 జనవరి 26న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.
