Varasudu Review: నటీనటులు : విజయ్ , రష్మిక మండన , శ్రీకాంత్ ,శరత్ కుమార్ , సంగీత , శ్యామ్ , ప్రకాష్ రాజ్ , జయసుధ
నిర్మాత : దిల్ రాజు
డైరెక్టర్ : వంశీ పైడిపల్లి
మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్ .థమన్
సినిమాటోగ్రఫీ : పళనీ కార్తీక్

Varasudu Review
తమిళనాడు లో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అదే రేంజ్ లో క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో విజయ్..క్రేజీ డైరెకర్స్ తో సినిమాలు చేస్తూ హిట్టు మీద హిట్టు కొడుతూ ఎవరికీ అందని రేంజ్ లో స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్నాడు..ప్రస్తుతం ఆయన క్రేజ్ ఎలా ఉందంటే , ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా సూపర్ హిట్ అయిపోయేంత..గత ఏడాది లో విడుదలైన విజయ్ ‘బీస్ట్’ చిత్రానికి అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా సూపర్ హిట్ గా నిలిచింది..అలాంటి స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న విజయ్ నుండి వచ్చిన లేటెస్ట్ చిత్రం ‘వారసుడు’..ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు కి కోలీవుడ్ లో ఇది మొట్టమొదటి సినిమా..ఈ చిత్రానికి డైరెక్టర్ కూడా మన టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి..పాటలు మరియు ట్రైలర్ తో విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఈరోజు విడుదల అయ్యింది..రెస్పాన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము.
కథ :
రాజేంద్రన్ (శరత్ కుమార్) అనే మల్టీ మిలీనియర్ తన వ్యాపార ప్రపంచం లో ఎప్పుడూ విజయాలనే చూడాలనుకునే వ్యక్తి..అతనికి ఉన్న ముగ్గురు కొడుకుల్లో ఇద్దరు తన కంపెనీ లోనే పనిచేస్తూ ఉంటారు.. కానీ మూడవ కొడుకు విజయ్ మాత్రం తనకి నచ్చిన దారిలో వెళ్తూ స్వతంత్రంగా బతకడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.. అయితే కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల మళ్ళీ ఇంటికి తిరిగొస్తాడు..ఇక్కడకి వచ్చిన తర్వాత ఏది కరెక్ట్ గా ఉండని విషయాన్ని గమనిస్తాడు.. తన తండ్రి బిజినెస్ సమస్యలలో చిక్కుకోవడాన్ని గమనిస్తాడు.. కానీ చివరికి ఆ సమస్యల నుండి తన తండ్రిని కుటుంబాన్ని విజయ్ ఎలా కాపాడుకున్నాడు అనేదే మిగిలిన స్టోరీ.
విశ్లేషణ:
డైరెక్టర్ వంశి పైడిపల్లి సినిమాల్లో ఎమోషన్స్ కోర్ పాయింట్ గా ఉంటాయి.. అవే తన సక్సెస్ ఫార్ములా గా మార్చుకొని కెరీర్ లో రాణిస్తూ వస్తున్నాడు..ఈ సినిమాకి కూడా అదే చేసాడు.. స్టోరీ రొటీన్ అయ్యినప్పటికీ కూడా ఎమోషన్స్ విషయం లో చాలా కేరింగ్ తీసుకున్నాడు.. అందుకే ఈ సినిమా సంక్రాంతికి వచ్చిన ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది.. అయితే ఈ సినిమాని చూస్తున్నంత సేపు రెండు మూడు పాత సినిమాలను మిక్స్ చేసి కొట్టినట్టు అనిపిస్తుంది.. వంశీ పైడిపల్లి గత సినిమాలు కూడా ఇలాగే ఉంటాయి..ఇదొక్కటి అతను మార్చుకుంటే రొటీన్ సినిమా తీసాడనే భావన ప్రేక్షకుల్లో రాదు.

Varasudu Review
ఇక ఈ సినిమాకి పెద్ద పాజిటివ్ పాయింట్ ఇళయ దళపతి విజయ్.. ఇందులో ఆయన కామెడీ మరియు ఎమోషన్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించాడు.. చాలా కాలం తర్వాత విజయ్ నుండి ఇంత అద్భుతమైన నటనని చూసే ఫ్యాన్స్ కి అనందం తో కన్నీళ్లు రక తప్పదు..ఇక థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమా ఒక ఆయువు పట్టులాగా నిల్చింది..పాటలు కూడా సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లింది..’రంజితమే’,’వా తలపతి’ సాంగ్స్ ఆన్ స్క్రీన్ మీద అదిరిపోయాయి..ఇక హీరోయిన్ గా నటించిన రష్మిక కూడా పర్వాలేదు అనే రేంజ్ లో చేసింది..శ్రీకాంత్ , యోగిబాబు మరియు శరత్ కుమార్ వంటి నటులు పెర్ఫార్మన్స్ కూడా బాగానే పండింది.
చివరి మాట :
సంక్రాంతికి ఒక కుటుంబ కథా చిత్రాన్ని చూడాలనుకునేవారికి ఈ సినిమా ఒక బెస్ట్ ఛాయస్.. అయితే తెలుగులోని కొన్ని సినిమాలను కలిపి కొట్టినట్టుగా ఇది ఉంటుంది. అత్తారింటికి దారేది, అలవైకుంఠపురం ను మిక్స్ చేసినట్టుగా కనిపిస్తుంది. క్రిటిక్స్, సీరియస్ ప్రేక్షకులకు మాత్ర ఇది యావరేజ్ సినిమాగా చెప్పొచ్చు.
రేటింగ్ : 2.5/5